YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

నీరవ్ మోడీ అరెస్ట్

నీరవ్ మోడీ అరెస్ట్

పీఎన్బీ స్కాంలో ప్ర‌ధాన నిందితుడు ప్ర‌ముఖ వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోదీ అరెస్ట‌యిన‌ట్లు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుతో పాటు పలు బ్యాంకులకు వేల కోట్లలో కుచ్చుచోటి పెట్టి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అరెస్ట్ కోసం భార‌త ప్ర‌భుత్వం అన్ని విధాలుగా ప్ర‌య‌త్నిస్తోంది. హాంకాంగ్‌లో నీరవ్ మోదీని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. చైనా ప్ర‌భుత్వ అనుమ‌తితోనే ఈ అరెస్ట్ జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది.కాగా.. పలు బ్యాంకులకు రూ.13వేల 500కోట్లను నీరవ్ మోదీ ఎగ్గొట్టారు. ఈ కుంభ‌కోణం బయటకు రాకముందే ఆయన దేశాన్ని వదిలి పారిపోయాడు. ఆ తరువాత అమెరికా, లండన్ ఇలా పలు దేశాలలో నీరవ్ మోదీ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల అతడు హాంకాంగ్‌లో ఉన్నాడని పక్కా సమాచారాన్ని అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. జాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణంతో తెరపైకి వచ్చాడు డైమండ్‌ మర్చంట్‌ కమ్‌ డిజైనర్‌ నీరవ్‌ మోడీ. 1971లో గుజరాత్ సూరత్ లోని వజ్రాల వ్యాపారుల కుటుంబంలో జన్మించాడు. వాల్డ్ డైమండ్ క్యాపిటల్ గా పేరుగాంచిన బెల్జియంలోని యాంట్ వెర్ప్‌ లో పెరిగాడు. పెన్సిల్వేనియాలోని వార్ట్ సన్ బిజినెస్‌ స్కూల్లో చదువును మధ్యలోనే వదిలేసిన నీరవ్… తన అంకుల్‌ దగ్గర డైమండ్ ట్రేడింగ్ లో మెళకువలు నేర్చుకున్నాడు. 1999లో ఫైర్ స్టార్ పేరుతో సొంతంగా డైమండ్ ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించాడు. 2008లో తన గర్ల్ ఫ్రెండ్ కోసం నీరవ్ రూపొందించిన ఇయర్ రింగ్స్ డిజైన్ ఆయన జీవితాన్ని మార్చేసింది. అప్పటి నుంచి ఆయన డైమండ్‌ జ్యుయెలరీ డిజైనింగ్‌పై దృష్టి పెట్టాడు. 2010లో 12.29 క్యారెట్ల గోల్కొండ డైమండ్‌ పొదిగిన నెక్లెస్‌ను రూపొందించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు నీరవ్‌. హాంకాంగ్‌లో నిర్వహించే క్రిస్టీన్‌ వేలంలో ఆ నెక్లెస్‌ రికార్డు స్థాయిలో 16 కోట్లు పలకడంతో నీరవ్‌ మోడీ బ్రాండ్‌ వాల్డ్‌ వైడ్‌గా పాపులర్‌ అయింది.బెల్జియం నుంచి భారత్‌ కు తిరిగొచ్చిన నీరవ్ మోడీ.. 2014లో ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో తన ఫస్ట్ స్టోర్ ఓపెన్ చేశాడు. నీరవ్ మోడీ బ్రాండ్ నేమ్ తో రూపొందించిన డిజైన్లకు డిమాండ్ పెరగడంతో వ్యాపారాన్ని ముంబైకు విస్తరించాడు. 2015లో ముంబైలోని కాలా ఘోడా ప్రాంతంలో డైమండ్‌ స్టోర్ అందుబాటులోకి తెచ్చాడు. ఆ తర్వాత నీరవ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నీరవ్ మోడీ బ్రాండ్ వాల్డ్ వైడ్ పాపులర్ కావడంతో విదేశాల్లోనూ స్టోర్లు తెరిచాడు. 2015లోనే న్యూయార్క్ తో పాటు హాంకాంగ్ లోనూ స్టోర్లు ఓపెన్ చేసిన నీరవ్… 2016లో హాంకాంగ్ లోనే మరో రెండు డైమండ్‌ దుకాణాలను అందుబాటులోకి తెచ్చాడు. ఈ మధ్యకాలంలోనే లండన్ బాండ్ స్ట్రీట్, ఎంజీసీ మకేలో మరో రెండు డైమండ్‌ స్టోర్స్‌ ఓపెన్‌ చేశాడు.వజ్రాలు కేవలం ఆభరణాలు కాదు… పెట్టుబడి అంటాడు నీరవ్‌. ఈ ఈక్వేషన్‌తోనే తన బ్రాండ్‌ను ప్రమోట్‌ చేశాడు. ప్రస్తుతం నీరవ్‌ మోడీ బ్రాండ్‌ పేరుతో మూడు ఖండాల్లో 16 స్టోర్లు ఉన్నాయి. ఆసియాలో చైనా నుంచి ఉత్తర అమెరికాలోని హవాయి దీవుల దాకా నీరవ్‌ డైమండ్స్‌ కు డిమాండ్‌ ఉంది. వజ్రాల వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగిన నీరవ్‌ మోడీని ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ భారత్‌లో అత్యంత చిన్న వయసు బిలియనీర్‌ అంటూ ఆకాశానికెత్తింది. 2013లో ఫోర్బ్స్‌ బిలియనీర్ల లిస్టులో తొలిసారి చోటు దక్కించుకున్న ఆయన.. అప్పటి నుంచి తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. 2015లో ఫోర్బ్స్‌ లిస్టులో నీరవ్‌ అంతర్జాతీయంగా వెయ్యి 54, భారత్‌లో 82వ ర్యాంకు దక్కించుకున్నాడు. 2016 బిలియనీర్ల లిస్టులో ప్రపంచంలో వెయ్యి 67వ ర్యాంకు పొందిన నీరవ్‌ భారత్‌లో 46వ స్థానంలో నిలిచాడు. ఆ ఏడాది ఫోర్బ్స్‌ పత్రిక నీరవ్‌ మోడీని భారత దేశపు వజ్రాల రారాజుగా వర్ణించింది. 2017లో ఫోర్బ్స్‌ ఇండియన్‌ బిలియనీర్స్ లిస్ట్‌ లో ఆయన 85వ ర్యాంకు దక్కించుకున్నాడు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడా బిజినెస్‌మెన్లు, రాజకీయ నేతలు, వజ్రాల కొనుగోలుదారులకు నీరవ్‌ మోడీ సుపరిచితుడు. బాలీవుడ్‌లోనే కాదు హాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లు నీరవ్‌ మోడీ డైమండ్‌ కలెక్షన్స్ సొంతం చేసుకునేందుకు ఉబలాటపడతారు. భారత్‌లో ప్రియాంక చోప్రా నీరవ్‌ మోడీ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్నారు. బిలియన్‌ డాలర్లలో బిజినెస్‌ చేసే బిజినెస్‌మెన్‌ అయినప్పటికీ నీరవ్‌ మోడీ లో-ప్రొఫైల్‌ మెయింటెన్‌ చేస్తారు. అందుకే ఆయన గురించి చాలా మందికి తెలియదు. తాజాగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో జరిగిన 11 వేల కోట్ల స్కాంతో నీరవ్‌ మోడీ గురించి యావత్‌ దేశం తెలుసుకుంది. ఆయన అక్రమాల గురించే చర్చించుకుంటోంది.

Related Posts