YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సజ్జలకు పార్టీ బాధ్యతలేనా..

సజ్జలకు పార్టీ బాధ్యతలేనా..

సజ్జలకు పార్టీ బాధ్యతలేనా..
గుంటూరు, జూన్ 2,
అదేంటి ఈ వార్తే వినడానికి విచిత్రంగా ఉంది. ఎందుకంటే జగన్ కుర్చీ అన్నది ఆయన కష్టార్జితం. ఆయన‌ పదేళ్ళ పాటు పట్టుదలతో సాధించుకున్నది. మరి జగన్ కుర్చీ దిగిపోవడం ఏంటి అన్న డౌట్ రావచ్చు. జగన్ కుర్చీ దిగేది ముఖ్యమంత్రి సీట్లో నుంచి కాదు. ఆయన వైసీపీ ప్రెసిడెంట్ కుర్చీ నుంచిట. ఈ వార్త కూడా విడ్డూరమే. జగన్ పార్టీకి కర్త కర్మ, క్రియ. ఆయన లేకుండా వైసీపీని ఎవరూ ఊహించులోలేరు. కానీ జగన్ తన పార్టీని అభివృధ్ధి చేసుకొవడానికి ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నారని అంటున్నారు.జగన్ సీఎం అయ్యేంతవరకూ ప్రార్టీ పాణం పెట్టి పనిచేసింది. మా అన్న ముఖ్యమంత్రి కావాలి అని క్యాడర్ గట్టిగా జనంలో ఉంటూ కష్టించారు. ఇక జగన్ పదేళ్ల పాటు అనేక పోరాటాలు చేసి పార్టీని నడిపారు ఇపుడు జగన్ ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు. దాంతో పార్టీ పడకేసింది అంటున్నారు. ఇపుడు ఏపీలో ప్రభుత్వం మాత్రమే పనిచేస్తోంది. వైసీపీ మాత్రం తెర వెనక్కి వెళ్ళిపోయింది. అధికారంలోకి మళ్ళీ రావాలంటే పార్టీ పటిష్టంగా ఉందాలి. ఆ సంగతి తెలిసినా జగన్ పార్టీకి సమయం కేటాయించ లేకపోతున్నారుట.ఇక జగన్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కీలకంగా మారారు. జగన్ కి అతి సన్నిహితంగా ఆయన ఉంటున్నారు. ఓ విధంగా పార్టీకి ఆయనే దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. పార్టీలో ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు. జగన్ ప్రభుత్వం ఏడాది పండుగ మీద కూడా క్యాడర్ కి పిలుపు ఇచ్చిన సజ్జల ఇప్పటిదాకా పార్టీ యాక్టివిటీస్ ని మోనిటరింగ్ చేస్తున్నారు. అందువల్ల ఆయనకే పార్టీ కిరీటం తొడగాలని జగన్ భావిస్తున్నాడు అంటున్నారు.వైసీపీలో కొత్త పోస్ట్ క్రియేట్ చేస్తారట. అదే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి. జగన్ అధ్యక్షుడిగా ఉంటారు. ఈ కొత్త పోస్టులో సజ్జలని నియమించి మొత్తం పార్టీని నడిపించమని జగన్ కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. సజ్జలకు పార్టీలోని అన్ని విభాగాల క్యాడర్ తోనూ, నాయకులతోనూ సంబంధాలు ఉన్నాయి. జగన్ జైలులో ఉన్న సమయంలో కూడా పార్టీ గాడి తప్పకుండా సజ్జల భారం మోశారు. ఇక మీడియా రిలేషన్లు కూడా ఆయనకు బాగానే ఉన్నాయి. దాంతో పార్టీని కొంతవరకూ కదలించే శక్తి ఆయనకే ఉందని జగన్ నమ్ముతున్నారుట. ఎన్నికల వేళకు జగన్ ఎటూ వైసీపీ ప్రెసిడెంట్ గా తెర మీదకు వస్తారు. ఈ నాలుగేళ్ళ పాటు పార్టీ కార్యకలాపాలు సజావుగా సాగాలంటే ఈ పోస్ట్ తప్పనిసరి అని జగన్ భావిస్తున్నారని భోగట్టా. అదే కనుక జరిగితే వైసీపీలో భారీ మార్పే చూడొచ్చన్న మాట.

Related Posts