YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 ఇప్పటికైనా ఐక్యతారాగం....పాడతారా

 ఇప్పటికైనా ఐక్యతారాగం....పాడతారా

 ఇప్పటికైనా ఐక్యతారాగం....పాడతారా
హైద్రాబాద్, జూన్ 2,
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చురుకుదనం కన్పిస్తుంది. రెండుసార్లు వరస ఓటములతో డీలా పడిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలన్న పట్టుదల కన్పిస్తుంది. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ చేతిలో దారుణంగా ఓటమి పాలయింది. నిజానికి తెలంగాణ రాష్ట్రం రావడానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శ్రమ నలభై శాతం అయితే, కాంగ్రెస్ 60 శాతం కారణమన్నది అందరికీ తెలసిందే. అయినా ఉద్యమకారుడిగా కేసీఆర్ ను ప్రజలు ఆదరించారు.కాంగ్రెస్ పార్టీ వరస ఓటములకు అనేక కారణాలున్నాయి. కాంగ్రెస్ నేతల్లో ఐక్యత కొరవడటంతో పాటు కేసీఆర్ ధీటుగా ప్రజల్లోకి వెళ్లకపోవడం ఒక కారణం. రాష్ట్రమిచ్చింది తామేనని ప్రజలను కన్విన్స్ చేయడంలో కాంగ్రెస్ నేతలు దారుణంగా విఫలమయ్యారు. అంతేకాకుండా పదవులపై ఉన్న శ్రద్ధ ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసాన్ని కల్గించడంలో విఫలమయ్యారు. గత ఎన్నికలలో మహాకూటమి ద్వారా వెళ్లినా ప్రజలు కాంగ్రెస్ ను విశ్వసించలేదు.పదేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తొమ్మిదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండటానికి కారణం నాయకత్వ వైఫల్యమేనని చెప్పకతప్పదు. కేసీఆర్ లాంటి మాటల మాంత్రికుడిని ఎదుర్కొనే ప్రయత్నం ఏ ఒక్కనేత చేయలేదు. 2018 ఎన్నికల తర్వాత కూడా వీరిలో మార్పు రాలేదు. గ్రూపు తగాదాలే కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో పలుచన చేస్తున్నాయని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాలను చేపట్టడానికి సిద్ధమవుతోంది.ప్రధానంగా నీటి ప్రాజెక్టుల అంశాన్ని ప్రధాన అజెండాగా మలచుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. జూన్ 6వతేదీన గోదావరి పెండింగ్ ప్రాజెక్టులపై దీక్షలు చేయనున్నారు. అలాగే కేసీఆర్ తీసుకువచ్చని కొత్త వ్యవసాయ విధానం పై కూడా ఉద్యమం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. భూముల కబ్జాపై కూడా ప్రజల వద్ద కు వెళ్లాలని కాంగ్రెస్ రెడీ అయింది. ఇందుకోసం నాలుగు కమిటీలను ఏర్పాటు చేసింది. ఇప్పటికైనా ఐక్యతగా ముందుకు వెళితే కాంగ్రెస్ పార్టీని ప్రజలు భవిష్యత్తులో చేరదీసే అవకాశముంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే ఉద్యమాలు ప్రారంభించింది. మరి కాంగ్రెస్ ఉద్యమాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి

Related Posts