YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఆర్టీసీలో కరోనా కష్టాలు

ఆర్టీసీలో కరోనా కష్టాలు

ఆర్టీసీలో కరోనా కష్టాలు
హైద్రాబాద్, జూన్ 2,
రాష్ట్ర ఆర్టీసీని కరోనా కోలుకోకుండా చేస్తోంది. జిల్లాల నుంచి వచ్చే బస్సులు రోడ్డెక్కినా…ప్రయాణికులు  మాత్రం  బస్సెక్కుందుకు  ఆసక్తి  చూపడం లేదు. కరోనా  భయం, మండిపోతున్న ఎండలతో జనం  బయటకు  రావాలంటేనే  భయపడుతున్నారు. కర్ఫ్యూ నుంచి  ఆర్టీసీకి  మినహాయింపు  ఇచ్చినా  లాభం లేకుండా పోయింది.  సాయంత్రం  ఆరు తర్వాత  ఆర్టీసీ బస్టాండ్లు, బస్సులు బోసిపోయి  కనిపిస్తున్నాయి. ఒకరిద్దరు  ప్రయాణికులతోనే గమ్యస్థానాలకు  బయల్ధేరుతున్నాయి.కరోనా వైరస్ ఆర్టీసీని నష్టాల పలుచేసింది. పండగలు, ప్రభుత్వ సెలవులు వస్తే చాలు…హైదరాబాద్ లోని ప్రధాన బస్టాండ్లు జనంతో కిటకిటలాడేవి. కానీ ఇప్పుడు కరోనా దెబ్బకు జనం లేక బోసిపోతున్నాయి. లాక్ డౌన్ తో రెండు నెలలపాటు డిపోలకే పరిమితమైన బస్సులు…ప్రభుత్వ సడలింపులతో రోడ్డెక్కాయి. సిటీ బస్సులకు అనుమతి ఇవ్వకున్నా…జిల్లాల బస్సులు నడిపారు అధికారులు. మొదట ఉదయం ఆరు నుంచి సాయంత్రం 8 లోపు బస్సులు నడిచేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఎండల తీవ్రతకు మధ్యాహ్నం పూట ప్రయాణికులు రావడం లేదని అధికారులు చెప్పడంతో…కర్ఫ్యూ నుంచి ఆర్టీసీకి మినహాయింపు ఇచ్చింది సర్కార్. అయినా ప్రయాణికుల నుంచి అంతంత మాత్రంగానే స్పందన కనిపిస్తోంది.రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పేషంట్ల సంఖ్య పెరుగుతుండడంతో జనం పరేషాన్ అవుతున్నారు. అవసరమైతే తప్పా బయటకు రావడం లేదు. వచ్చినా ఆర్టీసీ బస్సులు ఎక్కేందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఒకవేళ అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే…సొంత వాహనాలు, ప్రైవేట్ ట్యాక్సీలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులు లేక వెలవెల బోతున్నాయి. వచ్చిన ఒకరిద్దరితోనే గమ్యస్థానాలకు బయల్ధేరడంతో సంస్థ తీవ్రంగా నష్టపోతోంది.ఆర్టీసీలో మొత్తం పది వేల 800 బస్సులున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో 3వేల లోకల్ బస్సులను మినహాయించి…మిగితామన్నీ డిస్ట్రిక్ బస్సులే. వీటి ద్వారా ప్రతీ రోజు ఆర్టీసీకి 12 నుంచి 13 కోట్ల ఆదాయం వచ్చేది. అయితే కరోనాతో ఆదాయం కోల్పోవడంతో పాటు.. సంస్థ నష్టాల్లోకి వెళ్ళింది. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోతోంది. కరోనా దెబ్బకు ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోయిందంటున్నారు ఉద్యోగులు. 10 రోజులుగా డిస్ట్రిక్ బస్సులు తిప్పుతున్నా ఆదాయం రావడం లేదంటున్నారు.నిత్యం రద్దీగా ఉండే రూట్లలోనూ జనం బయటకు రావడం లేదంటున్నారు అధికారులు. గతంలో ఒక్కో ట్రిప్పుకు 30 నుంచి 40 వేలు వస్తే..ఇప్పుడు కనీసం డీజిల్ ఖర్చులు  రావడం లేదంటున్నారు. షెడ్యూల్ ప్రకారం ట్రిప్పులు నడుపుతున్నా..పబ్లిక్ నుంచి ఎలాంటి స్పందన లేదంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే..సంస్థ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు.  హైదరాబాద్ లో ప్రధాన బస్టాండ్లైన జేబీఎస్, ఎంజీబీఎస్ లతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని బస్టాండ్లు సాయంత్రం తర్వాత బోసిపోయి కనిపిస్తున్నాయి. బస్సులను శానిటైజ్ చేసి తిప్పుతున్నా..జనం బస్సులు ఎక్కడం లేదు. కరోనా భయంతో జర్నీ చేయడమే మానేశారు. అయితే బస్సులో ప్రయాణించే వారికి తప్పని సరిగా మాస్కులు ఉండేలా చూస్తున్నామంటున్నారు సిబ్బంది.

Related Posts