YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ నియంత

కేసీఆర్ నియంత

కేసీఆర్ నియంత
హైదరాబాద్ జూన్ 2,
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్టును ఖండిస్తున్నానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం అయనను హైదరాబాద్ లో పోలీసులు హౌస్ అరెస్టు చేసారు. ఎంపీ మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ  దగ్గర దీక్ష కార్యక్రమం రద్దు చేసుకొని సందర్శనకు మాత్రమే వెళదామని నిర్ణయం తీసుకున్నాం. ఆవిర్భావ దినోత్సవం నాడు ఇళ్ల వద్ద నేతలను అరెస్ట్ చేయడం దారుణం. ఇది కెసిఆర్ నియంత పోకడలకు నిదర్శనమని అయన అన్నారు. కృష్ణ పరివాహక జలాల పరిరక్షణలో భాగంగా కృష్ణ నది జలాల వద్ద కాంగ్రెస్ పార్టీ దీక్షలకు  పిలుపుచ్చిన నేపథ్యంలో ముఖ్య నేతలను పోలీసులు హోస్ అరెస్ట్ లు చేసారు. రాష్ట్రవ్యాప్తంగా హౌస్ అరెస్టులు కొనసాగాయి. పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్ల వద్ద ఉదయం నుండి పోలీసులు ల మోహరించారు. 

Related Posts