YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

మూడో స్థానానికి చేరుకున్న భారత్

Highlights

  • మూడో స్థానానికి చేరుకున్న భారత్
  • కామన్ వెల్త్ లో బంగారం పండుతోంది
మూడో స్థానానికి చేరుకున్న భారత్

భారత్ క్రీడాకారులు క్రమంగా జోరు పెంచుతున్నారు. వెయిట్ లిఫ్టర్లు ఇప్పటికే 9 పతకాలు గెలుపొందగా.. షూటర్లు కూడా గట్టి పోటీనిస్తున్నారు. కామన్వెల్త్ క్రీడల రికార్డులని బద్దలు కొడుతూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌ విభాగంలో మనుబాకర్ స్వర్ణం గెలవగా.. సోమవారం ఈ విభాగంలోనే జీతురాయ్ కూడా సంచలన ప్రదర్శనతో బంగారు పతకాన్ని గెలుపొందాడు. మొత్తం 235.1 పాయింట్లు సాధించిన జీతురాయ్ కామన్వెల్త్ రికార్డుల్ని బ్రేక్ చేశాడు. అతనితో పాటు.. ఓం ప్రకాశ్ కూడా ఇదే ఈవెంట్‌లో 214.3 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుపొందాడు.ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే వెయిట్ లిఫ్టర్లు మీరాబాయి చాను, సంజిత చాను, సతీశ్ శివలింగం, రాగాల వెంకట రాహుల్, పూనమ్ యాదవ్ భారత్‌కి బంగారు పతకాలు అందించగా.. కామన్వెల్త్‌లో ఐదోరోజైన సోమవారం ప్రదీప్ సింగ్ రజత పతకాన్ని గెలుపొందాడు. 105 కేజీల విభాగంలో పోటీపడిన ప్రదీప్.. మొత్తం 352 కిలోలు ఎత్తి వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కి 9వ పతకాన్ని అందించాడు. దీంతో ఇప్పుడు భారత్ ఖాతాలో మొత్తం 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి.స్నాచ్‌లో గరిష్ఠంగా 152 కిలోలు ఎత్తిన ప్రదీప్ సింగ్ భారత్‌కి మరో పసిడి పతకం అందించేలా కనిపించాడు. కానీ.. క్లీన్ అండ్ జర్క్‌లో ఈ జలంధర్ వెయిట్ లిఫ్టర్ తడబడ్డాడు. మొదటి ప్రయత్నంలో 200 కిలోలు ఎత్తినా.. తర్వాత వరుసగా 209, 211 కిలోలను ఎత్తడంలో విఫలమయ్యాడు. దీంతో.. 152+ 200=352 కిలోలతో రజతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఏడాది కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచిన ప్రదీప్ అక్కడ క్లీన్ అండ్ జర్క్‌లో 209 కిలోలు ఎత్తాడు.మరో వైపు వెయిట్ లిఫ్టర్ ప్రదీప్ సింగ్ కూడా రజత పతకాన్ని గెలుపొందాడు. 105 కేజీల విభాగంలో పోటీపడిన ప్రదీప్.. మొత్తం 352 కిలోలు ఎత్తి వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కి 9వ పతకాన్ని అందించాడు. దీంతో.. ఈరోజు మూడు పతకాలు చేరడంతో ఇప్పుడు భారత్ ఖాతాలో ప్రస్తుతం 8 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌ షూటింగ్‌లో ఆదివారం మను బాకర్‌తో పాటు హీనా సిద్దూ (రజతం), రవికుమార్ (కాంస్యం) గెలుపొందారు.

Related Posts