YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

వరంగల్ కు పరిశ్రమలు రానున్నాయి

వరంగల్ కు పరిశ్రమలు రానున్నాయి

వరంగల్ కు పరిశ్రమలు రానున్నాయి
వరంగల్ జూన్ 2,
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ హన్మకొండ లోని అమరుల స్థూపం వద్ద తెలంగాణ అమర వీరులకు రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. తరువాత వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండా ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత సీఎం, నాటి ఉద్యమ నేత కేసిఆర్ నాయకత్వంలో అనేక మంది పోరాటాల ఫలితం తెలంగాణ. అమరుల బలిదానాలు, త్యాగాల నిరతి నేటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. సీఎం కేసిఆర్ తెలంగాణ ని దేశంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షల కు అనుగుణంగా పరిపాలన సాగుతున్నది. సాగు నీటి తో తెలంగాణ సస్యశ్యామలం అవుతున్నది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కరోనా కష్ట కాలం లోనూ నిరాటంకంగా కొనసాగుతున్నాయి. రైతును రాజుని చేసే పనిలో సీఎం కేసిఆర్ ఉన్నారు. అందుకే సీఎం కేసిఆర్ రైతులకు రుణ మాఫీ, రైతు బంధు, రైతు బీమా వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వమే రైతుల పంటలను రూ.30వేల కోట్లు వెచ్చిస్తున్నారని అన్నారు. అలాగే రైతులు, మన వ్యవసాయం శాస్త్రవేత్తల అధ్యయనం మేరకు ప్రభుత్వమే ఏయే పంటలు వేయాలో సూచిస్తున్నది. నియంత్రిత పంటలను వేయండి. లాభసాటి గా మారండి. దేశం లో తెలంగాణ నెంబర్ వన్ అయితే, తెలంగాణ లో వరంగల్ నెంబర్ వన్ గా మారుతున్నది. త్వరలోనే వరంగల్ పూర్వ, రూరల్ జిల్లాలో అనేక పరిశ్రమలు రానున్నాయని అయన వెల్లడించారు.  అన్ని రంగాల్లో వరంగల్ అగ్రగామిగా మారనుంది. వరంగల్ ప్రణాళిక కూడా ఆమోదం పొందింది. కరోనా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వచ్చే వానా కాలం సీజన్ లో అంటు వ్యాధులు ప్రబల కుండా జాగ్రత్త పడాలి. పల్లె ప్రగతికి కొనసాగింపు గా నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. తెలంగాణని బంగారు తెలంగాణ చేయడానికి పాటు పడుతున్న సీఎం కేసిఆర్, మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతలు, ధన్యవాదాలని అన్నారు.  తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ హరిత, సీపీ రవీందర్, ఏసిపి వెంకట లక్ష్మి, పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

Related Posts