YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కమలంపై సీనియర్ నేతలు గుస్సా

కమలంపై సీనియర్ నేతలు గుస్సా

కమలంపై సీనియర్ నేతలు గుస్సా
హైద్రాబాద్, జూన్ 2, 
అదేంటో తెలంగాణాలో బీజేపీ ఉంది. దేశంలో ఇతర రాష్ట్రాలో బీజేపీ శాఖలు ఉన్నాయి. మరి దేనికీ లేని రాని బాధ ఒక్క ఏపీ బీజేపీకి వచ్చింది ఎందుకు అంటే ఇక్కడ ఉన్న నాయకత్వం బలహీనమైనది. పైగా చాలా సులువుగా ప్రభావితం అవుతుంది అని ప్రచారంలో ఉంది. చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నపుడు కూడా ఏపీ బీజేపీ నేతలే ఆయనకు సన్నిహితంగా ఉన్నారు తప్ప తెలంగాణా నేతలు కానే కారు. ఇది చాలు ఏపీలో బీజేపీ తనకు తానుగా నిలబడకుండా ఎంతలా ఇతర పార్టీలపైన ఆనుతుందో చెప్పడానికి, ఇక బాబు ఏపీలో అధికారంలో ఉన్నపుడు కొన్నేళ్ళ పాటు హరిబాబు బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన బాబు మీద ఒక్క విమర్శ కూడా చేయలేదు. అందుకే ఆయన్ని తప్పించి ఆ స్థానంలో కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన కన్నా లక్ష్మీనారాయణను నియమించారు. కన్నా ప్రెసిడెంట్ అయిన కొత్తల్లో చంద్రబాబు మీద బాగానే గర్జించారు. ఏకంగా తన ఇంటి మీద తమ్ముళ్ళ చేత‌ రాళ్ళు వేయించుకునేంతగా టీడీపీకి శత్రువు అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం కన్నా వ్యవహారశైలిలో మార్పు వచ్చిందని సొంత పార్టీ వారే అంటారు. ఆయన తన పదవిని కాపాడుకోవడానికి చంద్రబాబుతో కలిసారని చెబుతారు. మరి బాబుకు బీజేపీ పెద్దలకు మధ్య విభేదాలు ఉంటే ఎలా కన్నా పదవిని బాబు కాపాడుతారు. అంటే అక్కడే చాలా రాజకీయ లెక్కలు ఉన్నాయి. బీజేపీ కొత్త పూజారులుగా ఉన్న ఎంపీలు బాబుకు సన్నిహితులే. వారి ద్వారా కన్నా బాబు దారిలోకి వచ్చారని కమలం పార్టీలో ఇక వర్గం గుర్రుమంటోంది. వారి మద్దతు కూడగట్టుకోవడానికి బాబు చుట్టూ కన్నా ప్రదక్షిణలు చేస్తున్నారని చెబుతున్నారు.బీజేపీలో సీనియర్ మోస్ట్ నేత సుబ్రమణ్య స్వామి ఉన్నారు. ఆయన హిందూ ధర్మం గురించి పోరాడుతారు. అటువంటి స్వామి ఏపీలో టీటీడీ భూముల వ్యవహారంలో తప్పు అంతా చంద్రబాబు సర్కార్ దేనని తేల్చేశారు. అంతే కాదు, నాడు బీజేపీ మంత్రిగా ఉన్న దేవాదాయ శాఖను చూసిన మాణిక్యాలరావుది కూడా తప్పు అన్నారు. తన దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయని ఏకంగా 51 టీటీడీ స్థలాలు విక్రయానికి చంద్రబాబు సర్కార్ అధికారంలో ఉండగా ఆయన నియమించిన టీటీడీ పాలకవర్గం నిర్ణయించిందని కూడా స్వామి గుట్టు బయటపెట్టారు. అందులో బీజేపీ సభ్యులు కూడా ఉన్నారని అన్నారు. ఇంతా చేసి చంద్రబాబు తెలివిగా ఆ తప్పుని వైసీపీ మీద మోపుతున్నారని కూడా అన్నారు.ఏపీ బీజే నేతలు చంద్రబాబు ట్రాప్ లో పడ్డారని కూడా స్వామి అంటున్నారు. వెనక నుంచి చంద్రబాబు ఈ మొత్తం డ్రామాను నడిపిస్తున్నారని కూడా స్వామి అరోపిస్తున్నారు. ఏపీ బీజేపీ నేతలు ఈ విషయంలో తమ తప్పు తెలుసుకోవాలని కూడా స్వామి అనడం విశేషం. అంతే కాదు చంద్రబాబు ఆనాడు తాను టీటీడీ భూములు అమ్మకానికి నిర్ణయం తీసుకున్నందుకు ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పలని కూడా డిమాండ్ చేసారు. స్వామి తాను చేసిన ట్వీట్లను జనసేనాని పవన్ కి కూడా పెడుతూ అసలు విషయం తెలుసుకోమన్నారు. మొత్తం మీద చూసుకుంటే ఏపీలో కొంతమంది బీజేపీ నేతలు తెలుగుదేశం అజెండాను అమలుచేస్తున్నారన్న అనుమానాలను తీర్చేసి స్వామి ఆ నాయకుల ముసుగు బయటకు తీశారని అంటున్నారు. కేంద్రం వద్ద కూడా బాగా పలుకుబడి కలిగిన స్వామి ఈ విషయం ఢిల్లీ పెద్దల చెవిన వేస్తే ఇక ఏపీ బీజేపీ నేతల తోకలు కట్ అవడం ఖాయమేనట.

Related Posts