YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

జమ్మికుంటలో నీటి ట్యాంకర్లను ప్రారంభించిన మంత్రి ఈటల

జమ్మికుంటలో నీటి  ట్యాంకర్లను ప్రారంభించిన మంత్రి ఈటల

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో  రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హుజురాబాద్ పట్టణంలో ఒక కోటి రూపాయల వ్యయం తో నిర్మించనున్న షెడ్యూల్డ్  కులాల కమ్యూనిటీ  భవన  నిర్మాణానికి మంత్రి భూమిపూజ  చేసారు.  హుజురాబాద్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ లో 12 మంది లబ్ధిదారులకు 9 లక్షల రూపాయల విలువగల కల్యాణలక్ష్మి సీఎం రిలీఫ్ ఫ౦డ్  చెక్కులను పంపిణీ చేసారు. అనంతరం  జమ్మికుంట నగర పంచాయతీ పరిధిలో గల ప్రజల దాహార్తిని తీర్చడానికి ఉచిత మంచి నీటి ట్యాంకర్లను మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి ల మాట్లాడుతూ గత 20  సంవత్సరాలుగా ఈ ప్రాంతం త్రాగు నీటికి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంది. 24 గంటల నిరంతర పవర్ ఇచ్చిన, బోర్లు , బావులు త్రవ్వించిన సాద్యం కాదని గ్రహించి,  జమ్మికుంట లాంటి పెద్ద పట్టణానికి త్రాగు నీరు అందించడానికి 40కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు నిధులతో పైపులైనులు, వాటర్ ట్యాంక్ ల నిర్మాణాలు చేపట్టనట్లు తెలిపారు. రానున్న  రెండు నెలల కాలంలో ప్రపంచ నిధులతో పనులు పూర్తి అవుతాయి అన్నారు.   కరీంనగర్ దిగువ మానేరు డ్యాం వాటర్ గ్రిడ్ తో  అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ఈ వేసవిలో  ఇప్పటికిప్పుడు నీళ్ళు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి  ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి వాడకు నీటి సరఫరా చేస్తున్నాం అని మంత్రి తెలిపారు. జమ్మికుంట పట్టణానికి త్రాగునీరు సమస్యకి ఇదే చివరి ఎండాకాలం.  సాధ్యమైనంత తొందరగా వాటర్ గ్రిడ్ పనులు పూర్తి చేసి జూన్ 20 వరకు వాటర్ గ్రీడ్ ద్వారా ప్రతి ఇంటికి నల్లాల ద్వారా త్రాగునీరు అందిస్తామని  మంత్రి అన్నారు. 

Related Posts