YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గన్ పార్క్ వద్ద అలజడి

గన్ పార్క్ వద్ద అలజడి

గన్ పార్క్ వద్ద అలజడి
హైద్రాబాద్, జూన్ 2, 
తెలంగాణ అవతరణ వేడుకల సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించేందుకు గన్‌పార్క్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓ నిరుద్యోగి అడ్డుకున్నాడు. సీఎం కారు డోర్ దగ్గరకు దూసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసీఆర్ కారు దగ్గరకు దూసుకెళ్లిన వ్యక్తిని దేవరకొండకు చెందిన హనుమంతు నాయక్‌గా పోలీసులు గుర్తించారు. డబుల్ బెడ్రూం ఇల్లు కోసం తాను సీఎం కాన్వాయ్‌కు అడ్డుతగిలినట్లు అతడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో.. ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వం నిరాడంబరంగా నిర్వహిస్తోంది .ప్రగతి భవన్‌ నుంచి గన్‌పార్క్‌ చేరుకున్న ఆయన అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ సంతోష్‌ కుమార్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అమరవీరులకు నివాళులు అర్పించారు.

Related Posts