కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లు పవన్ కు కొత్త సవాల్ విసురుతున్నాయి. ఏపి కి ప్రత్యేక హోదా పై బిజేపి చేతులెత్తేయడంతో, అక్కడ తెలుగు ప్రజలు బిజేపి పై గుర్రుమంటున్నారు. ఈ తరుణంలో పవన్ ను ఎన్నికల ప్రచారానికి రావాలని తెలుగు సంఘాలు కోరబోతున్నాయి. ఒక వేళ వెళితే పవన్ దారెటూ? బిజేపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా? బిజేపి చేసిన ద్రోహానికి పవన్ కర్నాటక ఎన్నికలను వేధిక గా చేసుకోబోతున్నారా? పవన్ వెనుక బిజేపి ఉందన్న టిడిపి ప్రచారానికి చెక్ పెట్టాలంటే కర్నాటక ఎన్నికలు సరైనవని పవన్ శిభిరం భావిస్తోందా? కర్నాటక ఎన్నికల్లో బిజేపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే, మరి అక్కడ ప్రజలు ఎవరికి ఓటు వేయాలి. కాంగ్రెస్ ద్రోహానికి వ్యతిరేకంగా పార్టీ స్దాపించానని చెప్పిన పవన్ కళ్యాణ్, ఈ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయనున్నారు. కర్నాటక ఎన్నికల్లో చిరు వర్సెస్ పవన్ గా మారనుందా అంటే అవునని అంటున్నారు విశ్లేషకులు. అన్న చిరంజీవి కాంగ్రెస్ కు మద్దతుగా కర్నాటక ఎన్నికల్లో ప్రచారం చేస్తుంటే, తమ్ముడు పవన్ మాత్రం బిజేపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూనే, కాంగ్రెస్ ను సమర్దించడం లేదు. దీంతో చిరు ప్రచారం ఎలా ఉన్న పవన్ వైఖరి పై సర్వత్రా అసక్తి నెలకొంది... ఇదిలా ఉంటే బిజేపికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలనే అంశం పై పవన్ ద్రుష్టి పెట్టలేదని చెబుతున్నాయి జనసేన వర్గాలు. ఒక వేళ బిజేపికి వ్యతిరేకంగా ప్రచారం చేయకపోతే తెలుగు ప్రజలు బిజేపి, పవన్ డైరక్షన్ అనే అంశం బలపడుతుంది? ఒక వేళ ప్రచారం చేస్తే బిజేపి కి ఓటు వేయక పోతే మరి ఎవరికి వేయాలి అనేది చిక్కుముడి ప్రశ్న దీంతో పవన్ ఈ ఎన్నికల్లో వేలు పెట్టకపోవడం మంచిదని భావిస్తున్నరని సమాచారం.