YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దేశానికి దిక్సూచిగా తెలంగాణ

దేశానికి దిక్సూచిగా తెలంగాణ

దేశానికి దిక్సూచిగా తెలంగాణ
-  రాష్ట్ర వైద్యారొగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ 
నిరాడంబరంగా అవతరణ దినొత్సవ వేడుకలు
పెద్దపల్లి   జూన్ 02
రాష్ట్రం ఏర్పడిన 6 సంవత్సరాలలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ  నిలిచిందని    రాష్ట్ర వైద్యారొగ్య శాఖ మంత్రి  ఈటెల  రాజేందర్ అన్నారు.   జిల్లాలో నిర్వహించిన   రాష్ట్ర అవతరణ దినొత్సవ వేడుకలో  మంత్రి పాల్గోన్నారు.  కోవిడ్ 19  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిరాడంబరంగా   వేడుకలను నిర్వహించారు.    జిల్లాలోని ఎంపిడిఒ ఆవరణలో  గల అమరవీరుల స్థుపం వద్ద  మంత్రి అమరవీరులకు  నివాళులర్పించి, వారి  త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం   అయ్యప్ప స్వామి మందిరం వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహనికి మంత్రి  పూలమాల వేసి నివాళులర్పించారు.  అనంతరం   మంత్రి  కలెక్టర్  కార్యాలయంలో   గౌరవ వందనం స్వీకరించి  జాతీయపతాకావిష్కరణ చేసారు.  జిల్లా కలెక్టర్, ముఖ్య అధికారులు, ప్రజాప్రతినిధులతో  అవతరణ దినొత్సవం సందర్భంగా మంత్రి ముచ్చటించారు.  60 సంవత్సరాల ప్రజల సుదీర్ఝ పోరాటం,   అమరుల త్యాగఫలితంగా ఏర్పడిన   నూతన  రాష్ట్రంలో అనేక విజయాలు  సాధించామని అన్నారు.   దేశం మొత్తం మీద 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగొలు చేస్తే  , మన  తెలంగాణ  అందులో 63%  53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం  ఎఫ్.సి.ఐకు అందించి  దేశానికి అన్నపూర్ణగా అవతరించిందని  అన్నారు.  ఉమ్మడి  రాష్ట్రంలో  గోదావరి జిల్లాలో వరి అధికంగా  సాగు జరిగేదని ,  ప్రస్తుతం  మన  తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్  ఇండియాగా అవతరించిందని  అన్నారు.   ప్రస్తుత  కరొనా పరిస్థితులలో  ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని,  ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలని   మంత్రి తెలిపారు.   కరొనా వైరస్ విజృంభించినప్పటికి  ప్రజలకు వైద్యం అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్నామని,  ప్రజల వైద్యానికి అవసరమైన బెడ్లు,  పిపిఈ కిట్లు,  మందులను సిద్దం చేసామని,   ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని మంత్రి  కోరారు. అనంతరం జిల్లా అధికారులతో  కలెక్టర్ ఆత్మియ సమావేశం నిర్వహించారు.   నూతన   రాష్ట్రం ఏర్పడిన తరువాత   సాధించిన  ప్రగతి,  అధికారుల అనుభవాల గురించి కలెక్టర్ తెలుసుకున్నారు.  నూతన   రాష్ట్రం ఏర్పడిన తరువాత సాగునీటి రంగం,  వ్యవసాయ రంగంలో  అద్భుత ప్రగతి సాధించామని, అదే సమయంలో  విద్య, వైద్య  రంగాలలో సైతం  మంచి పురొగతి సాధించామని అధికారులు  అభిప్రాయ పడ్డారు.  నూతన జిల్లాల, డివిజన్లు, మున్సిపాల్టీలు, గ్రామాల ఏర్పాటుతో  ప్రజల చెంతకు ప్రభుత్వ పరిపాలన  అందిందని, పరిపాలన సౌలభ్యం  పెరిగిందని   తెలిపారు.  కోవిడ్ 19 వైరస్ నేపథ్యంలో ఉత్పన్నమైన  సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని,   సిబ్బందిని ప్రజలకు  వైరస్ పట్ల అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.ఐడిసి చైర్మన్  ఈద శంకర్  రెడ్డి,  పెద్దపల్లి ఎంపి బొర్లకుంట వెంకటేశ్ నేత,  జిల్లా ప్రజాపరిషత్  చైర్మన్ పుట్టమధు, జిల్లా కలెక్టర్  సిక్తా పట్నాయక్,   పెద్దపల్లి ఎమ్మెల్యే  దాసరి మనోహర్ రెడ్డి,  రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్,   అదనపు కలెక్టం లక్ష్మీనారాయణ,  డిసిపి  రవీందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  రఘువీర్ సింగ్,  రామగుండం  కార్పోరేషన్ మేయర్  అనిల్ కుమార్,  పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్  మమతా రెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజనర్  మూలవిజయా రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు  ఈ  కార్యక్రమంలో పాల్గోన్నారు.

Related Posts