ప్రత్యేకహోదా ఉద్యమం ఉధృత రూపం దాలుస్తోంది. ప్రత్యేక హోదా, విభజన హామీలు కోరుతున్న జేఏసీలన్ని ఒక్కటవుతున్నాయి.. ఇటు రాష్ట్రంలోనూ... అటు ఢిల్లీలోనూ ఉద్యమం రోజురోజుకు తీవ్రతరమవుతోంది. కేంద్రంపై ఒత్తిడి పెంచడం, హోదా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా.. ఏపీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ఏర్పడబోతోంది. అదే సమయంలో జేఏసీ కార్యక్రమాలకు హాజరవుతారు. జేఏసీలో పార్టీలకతీతంగా ఉంటాయి. వారిచ్చే పిలుపునకు అన్ని పార్టీల, ప్రభుత్వ మద్దతు కోరనున్నారు.ఏపీలో ప్రత్యేకహోదా ఉద్యమం తీవ్రతరం అవుతోంది.ఏపీలో ఇప్పుడు రెండు కొత్త కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఒకటి సమన్వయం కోసం. రెండు ఉద్యమ పంథా నిర్ణయించడానికి. ఆరెండిటిలో ఎవరికి చోటు ఉంటుందనే అంశం ఇప్పుడు హాట్ టాపికైంది.ప్రత్యేక హోదా పార్టీల నుంచి జేఏసీలు తీసుకోబోతున్నాయా...అంటే ఔననే సమాధానమే వస్తోంది. అశోక్ బాబు, చలసాని శ్రీనివాసరావు, బొప్పరాజు, మురళీకృష్ఱ, శివాజీ, కృష్ణాంజనేయులు, వంటి వారికి చోటు కల్పించేందుకు నిర్ణయించారు. అయితే జేఏసీ ఏం చేయాలి. ఎవరెవరు కమిటీలోఉంటారు. వాస్తవ పరిస్థితి ఏంటనేది రోజుల వ్యవధిలోనే నిర్ణయించనున్నారు. జేఏసీలో ఏపీ ఎన్జీవోలు, రిటైర్డ్ ఎంప్లాయిస్ దాదాపుగా 8 లక్షల మంది వరకు ఉన్నారు. వీళ్లకు జర్నలిస్టు సంఘాలు తో పాటు ఇతర సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. అయితే ప్రస్తుతం జేఏసీలు ఎవరి ఆధ్వర్యంలో నడవాలన్న అంశంపై చర్చ కొనసాగుతోంది.వైసీపీ , జనసేనలు అలానే దూరంగా ఉంటడం చర్చనీయాంశమైంది. హోదా కోసం ఉద్యమం చేస్తున్న సమయంలో ఎవరు పిలిచినా వస్తామని గతంలో జనసేన, వైసీపీలు ప్రకటించాయి. కానీ ఆచరణకు వచ్చేసరికి ఇందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నాయి. ఎవరికి వారే రాజకీయ ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే ఇది ఐక్య ఉద్యమంగా సాగడం లేదు. తొలి నుంచి టీడీపీ ఉద్యమ పంథాలో ఉంటే సరిపోయేది. అలా చేయక పోవడంతో చంద్రబాబును తాము నమ్మలేక పోతున్నామని పార్టీలు విమర్శిస్తున్నాయి అటు ప్రభుత్వం నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి సిపిఎం, సిపిఐలు వచ్చాయి. కానీ రెండో సమావేశం వచ్చేసరికి వారి ఆలోచన మారింది. వారం రోజుల వ్యవధిలోనే ఎందుకు తేడా వచ్చిందో అర్థం కాదు. అయితే కొత్త పొత్తుల ఆలోచనలు వచ్చాయా అనే చర్చ సాగుతోంది. బీజేపీ ఎలాగు అఖిల పక్షానికి దూరంగానే ఉంటోంది. ఎలాగు పోరాడితే..ఆరోపణలు చేసేది తమ పార్టీ పైనా కాబట్టి దూరంగా ఉంటుంది. అయితే తెలంగాణలో ఉద్యమ జేఏసీ పిలుపుకు అన్నీ పార్టీలు స్పందించేవి. ఇప్పుడు ఏపీలో ఇందుకు పరిస్థితి భిన్నం. మరి ఉద్యమ జేఏసీ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.కమలం పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటవతున్న పార్టీలు... కర్నాటకలో ప్రచారం చేయాలని నిర్ణయించాయి..ఇప్పటికే ఆందోళనలకు సంబంధించి యాక్షన్ ప్లాన్ రూపొందించిన ఏపీ జేఏసీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. రౌండ్ టేబుల్ సమావేశాలు, సభలు సమావేశాలు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి ఉద్యమాన్ని ఒక్క తాటిపై తీసుకురానున్నారు. కర్ణాటకలో బీజేపీని ఓడించడం... పార్టీలకు అతీతంగా అందరిని భాగస్వామ్యం చేయడం... దేశ వ్యాప్తంగా ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. లారీలు, రైళ్లపై స్టిక్కర్లు అంటించడం, పోస్టల్ కార్డు ఉద్యమంలతో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే యోచన ఉంది.