YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రేవంత్ రెడ్డి ఆరెస్టు 

రేవంత్ రెడ్డి ఆరెస్టు 

రేవంత్ రెడ్డి ఆరెస్టు 
రంగారెడ్డి జూన్ 02
ఇరిగేషన్ ప్రాజెక్టులపై తెలంగాణ కాంగ్రెస్ పోరుబాట పట్టింది. పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలన్న డిమాండ్ టీపీసీసీ ఉద్యమించింది. పలుచోట్ల పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డిని కొడంగల్లో హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి బయటకు వెళ్లకుండా పోలీసులు మోహరించారు. మళ్ళీ ఏమనుకున్నారో ఏమో ఆయన్ని స్టేషన్ కు తరలించి కూర్చోబెట్టారు. అటు నెట్టంపాడుకు వెళ్లేందుకు సిద్ధమైన టీ.కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గద్వాల జిల్లా శాంతినగర్లో సంపత్ కుమార్ను గృహనిర్బంధం చేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే వంశీచందర్రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టకుండా పోలీసులను మోహరించారు. ఇక ఎస్ఎల్బీస్ టన్నెల్ సందర్శనకు వెళ్తున్న టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ ఉత్తమ్ ను, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి లను మాల్ వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రాజెక్టు సందర్శనకు వెళ్లకుండా అడ్డుకున్నారు
 

Related Posts