YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

పంట కాలువ గట్టు తవ్వి  నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు

పంట కాలువ గట్టు తవ్వి  నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు

పంట కాలువ గట్టు తవ్వి  నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు
మంత్రి పేర్ని నాని 
మచిలీపట్నం  జూన్ 2 
పంట కాలువ తవ్వి గట్టును బలహీనపరిస్తే నష్టం వస్తుందని, సాగునీరు రైతులకు అందదని..కాలువ పనుల పునరుద్ధరణకు, మరమ్మతుకు మట్టి అవసరముంటుందని కాలువ గట్టుపైన, పక్కన ఉన్న మట్టి తవ్వితే చర్యలు తప్పవని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తీవ్రంగా  హెచ్చరించారు.  మంగళవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోసం పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలిశారు. బందరు మండలం లోని భోగిరెడ్డిపల్లి గ్రామంలో కొందరు ఇటీవల పంట కాలువ గట్లను , ఆకడ్ఢ మట్టిని అక్రమంగా తవ్వుతున్న విషయం స్వయంగా తెలుసుకున్న మంత్రి పేర్ని నాని  తన వద్దకు వచ్చిన భోగిరెడ్డిపల్లి  గ్రామస్థులతో ఈ విషయమై ఆరా తీశారు.  ఈ తరహా చర్యలు సరి కాదన్నారు. తాము కౌలుకు తీసుకొన్న విశాలమైన  పొలంలో ఆ విధంగా మట్టిని తవ్వగలరా అని ఆయన గ్రామస్తులను ప్రశ్నించారు. పంట కాలువ గట్టుకు బొరియలు పెట్టి  నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  భోగిరెడ్డిపల్లి లో  పంట కాలువ మట్టి తవ్వకం విషయం బందరు తాలూకా ఎస్ ఐ తో మాట్లాడి, అక్కడ ఉన్న జె సి బీ లు , పొక్లెయిర్లు స్టేషన్ కు  తీసుకొచ్చి తక్షణమే  సీజ్ చేయాలని మంత్రి పేర్ని నాని  తన వ్యక్తిగత కార్యదర్శికి సూచించారు.     కరోనా మహమ్మారితో ప్రభుత్వం చేస్తున్న అలుపెరగని పోరాటంకు మద్దతుగా పలువురు దాతలు  తమ దాతృత్వాన్నిచాటుకొంటున్నారు.  కనబడని శత్రువుతో జరుగుతున్న యుద్ధంలో తమ వంతు బాధ్యతగా  రూ 50 వేల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధికి అందచేయాల్సిందిగా  కోరుతూ రాష్ట్ర మంత్రి పేర్ని నానికి శ్రీ వేంకేటేశ్వర కన్సుల్టేన్సీ ఫర్ ప్లానింగ్ అండ్ ఇంజీనీరింగ్ ఉయ్యూరు కు చెందిన పుప్పాల శ్రీకాంత్ అందచేశారు.    తాగునీటి కుళాయి నీటి గొట్టాన్ని అటు నుంచి ఇటువైపునకు మార్చినందుకు కొందరు  మునిసిపల్ ఫిట్టర్ల 2 వేల రూపాయలు లంచం అడుగుతున్నట్లు ప్రజల నుండి పిర్యాదు వచ్చిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇప్పటికైనా వారు తమ లంచగొండి నైజం మార్చుకోకపోతే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించబడతారని ఆయన హెచ్చరించారు.    తాను వృద్ధ కళాకారుడిని అని, జర్నలిస్ట్ గా  గతంలో ఆంధ్రా డైలీ పేపర్ కు  అక్రిడేషన్ ఉండేదని తనకు బస్సు పాస్ అవసరమని జర్నలిస్ట్ అక్రిడేషన్ మంజూరు చేయాలనీ కొల్లి ప్రభాకర్ మంత్రి పేర్ని నాని కోరారు.  స్పందించిన ఆయన మీరు ఇప్పుడు వర్కింగ్ జర్నలిస్ట్ గా ఏదైనా మీడియాలో పనిచేస్తున్నారా అని అడిగారు. 2018 లో తనకు అక్రిడేషన్ ఉందని అందుకు  జెరాక్స్ లు అందచేశారు. ప్రస్తుతం మీరు ఏదైనా ప్రింట్ , ఎలక్ట్రానిక్ సంస్థలలో పనిచేస్తుంటే చెప్పండి అని ప్రభాకర్ ను మంత్రి అడిగారు.  మోపిదేవి మండలానికి చెందిన ముల్లంగి రాజు అనే గ్రామస్తుడు మంత్రి పేర్ని నానిని కలుసుకొని తన కష్టాలను ఏకరువు పెట్టారు. తాను ఒక హోటల్ కార్మికుడినని ఇటీవల పక్షవాతం రావడంతో పని నుంచి తనను తొలగించారని భార్యకు క్యాన్సర్ అని, తన ఏకైక కుమార్తె పెళ్ళిచేస్తే ఆమెకు కూతురు పుట్టిందని ఆరేళ్ల క్రితం తన అల్లుడు ఆమెను విడిచి ఎటో వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేసాడు. తమకు కుటుంబ పోషణ ఎంతో భారంగా ఉందని తన కుమార్తెకు ఏదైనా బ్యాంకులో 50 వేల రుణం ఇప్పిస్తే, బడ్డీ కొట్టు పెట్టుకొంటానని మంత్రికు విన్నవించాడు.     
 

Related Posts