YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

చేపల వేటకు వేళాయే

చేపల వేటకు వేళాయే

 

చేపల వేటకు వేళాయే
విశాఖపట్నం జూన్ 2 
లంగరు పడ్డ బోట్లు చేపల వేటకు సిద్దమవుతున్నాయి.ఈ సారి మత్య్పకారుల ఆర్దిక ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం ముందుగానే చేపల వేటకు అనుమతులు జారీ చేసింది.దీంతో విశాఖ ఫిష్పింగ్ హార్బర్ లో చేపల వేట కోసం మత్య్సకారులు కావాల్సిన సౌకర్యాలను సమకూర్చుకుంటున్నారు.సాంప్రదాయబద్దంగా పూజలు చేస్తూ ఈ సారి చేపల వేట ఆశాజనకంగా ఉండాలంటూ వేడుకుంటున్నారు మత్య్సకార మహిళలు.
సుమారుగా రెండు నెలల తర్వాత విశాఖ ఫిష్సింగ్ హార్బర్ లో మత్య్సకారుల హాడావుడి మొదలైంది.ఇంత కాలం చేపల వేట నిషేదం ఉండడంతో ఉపాది లేక అల్లాడిపోయిన మత్య్సకారులు ఇప్పుడు చేపల వేటకు సిద్దమవుతున్నారు.ఏటా ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి రెండు మాసాల వరకూ సముద్రంలో చేపల వేటను నిషేధిస్తుంది.అయితే ఈ సారి మాత్రం ముందుగానే చేపల వేటకు అనుమతులు జారీ చేసింది.విశాఖలో ఉన్న ఈ మత్య్సకార రంగంపై వేలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా చేపల వేటపై జీవనం సాగిస్తున్నారు.అయితే గత ప్రభుత్వ హాయంలో పరిహారం అంతంతమాత్రంగానే అందుకున్న మత్య్సకారులకు ఈ వైసీపీ ప్రభుత్వం అండగా నిలిచి ఇస్తామన్న పరిహారాన్ని అందించడంలో మత్య్సకారులు ప్రభుత్వ చోరవపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా డీజీల్ రాయితీ కూడా అందించడంతో తమకు ఆర్దికంగా ప్రభుత్వం ఆదుకుందని చెప్పారు. 

Related Posts