YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

కాంగ్రెస్ నేతల ఆరెస్టు

కాంగ్రెస్ నేతల ఆరెస్టు

కాంగ్రెస్ నేతల ఆరెస్టు
మిర్యాలగూడ జూన్ 2
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతలు జలదీక్షలు చేయాలని నిర్ణయించడంతో  'చలో ఎస్ఎల్బీసీ' కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. పోలీసుల అరెస్టును ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు.ఈ సందర్భంగా నల్గొండ డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ...తెలంగాణలో ఒక దుర్మర్గమైన పాలన కొనసాగుతోందని, 6వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికం, ఇంత దారుణమైన చర్య ఏది లేదని దుయ్యబట్టారు. మాట్లాడితేనే అరెస్ట్ చేయడం పాశవిక పాలనకు పరాకాష్ట అని అన్నారు. ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకుంది.. ఆవిర్భావ దినోత్సవం నాడే హక్కులు కాలరాస్తే ఎలా అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక నియంత, అసమర్థత పాలన సాగుతుందని, కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్లనుతీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 

Related Posts