YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కొలివుడ్ నుంచైనా చూసి నేర్చుకోండి...!

కొలివుడ్ నుంచైనా చూసి నేర్చుకోండి...!

రెండు దక్షిణాది రాష్ట్రాలే.... రెండు ఇబ్బందులను ఎదుర్కొంటున్నవే.....కానీ ఓ చోట కలసికట్టుగా ఉద్యమాలు సాగుతుంటే.....మరో చోట అందుకు భిన్నమైన పరిస్థితి. కావేరి నీటి యాజమాన్య బొర్డును ఏర్పాటు చేయాలని తమిళనాడులో పార్టీలకతీతంగా సాగుతున్నాయి. కావేరి సమస్య తేలేవరకు తమిళనాడులో ఐపీఎల్‌ మ్యాచ్‌లు కూడా జరగకూడదనే డిమాండ్‌ జోరుగా సాగుతోంది. సినీ నటులు దీనిని ముందుండి నడిపిస్తున్నారు. ఏపీలో కూడా ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు జరుగుతున్నా ఇక్కడ మాత్రం వారు పత్తాలేరు.రెండు రాష్ట్రాలు.... రెండు ఉద్యమాలు...... రెండు చోట్ల పరిస్థితులు వేరు..... కానీ ఓ రాష్ట్రంలో ఉద్యమం పార్టీలకతీతంగా సాగుతోంది. సినీ పరిశ్రమ దానిని ముందుండి నడిపిస్తుంటే మరో రాష్ట్రంలో అందుకు భిన్నమైన పరిస్థితి. ఆ రెండు రాష్ట్రాలే తమిళనాడు., ఆంధ్రప్రదేశ్‌.... తమిళనాడులో కావేరి బోర్డుపై రగడ జరుగుతుంటే ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం నడుస్తోంది. అదే సమయంలో దేశంలో ఐపీఎల్‌ సందడి మొదలైంది. నెల రోజుల పాటు జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు చెన్నై కూడా ఆతిథ్యమివ్వనుంది. కావేరి మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయకుంటే తమిళనాడులో మ్యాచ్‌లు నిర్వహించొద్దని తమిళ నటులు ఉద్యమిస్తున్నారు. ఈ డిమాండ్‌కు తమిళసూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌., కమల్‌హాసన్‌లు కూడా మద్దతు ప్రకటించారు. ఐపిఎల్‌ మ్యాచ్‌లకు వ్యతిరేకంగా తమిళ నటులు విజయ్‌., ధనుష్‌, సత్యరాజ్‌ వంటి వారు శనివారం చెన్నైలో నిరాహార దీక్ష చేపట్టారు. వారికి సంఘీభావం ప్రకటించిన రజనీ..... కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఐపిఎల్‌ మ్యాచ్‌లను బాయ్‌కాట్‌ చేయాలనే డిమాండ్‌కు ఆయన మద్దతు ప్రకటించారు. తమిళ ప్రజల న్యాయమైన డిమాండ్‌కు అందరు మద్దతునివ్వాలని కోరారు. కావేరి మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించినా అది అమలు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.తమిళనాడులో కావేరి మద్దతుగా జరుగుతున్న ఉద్యమానికి ఏపీలో ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమానికి పోలికే కనిపించదు. తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం అక్కడి సినీ పరిశ్రమ మొత్తం ఏకమైంది. తమిళ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు స్వచ్ఛంధంగా ముందుకు వస్తున్నారు. పార్లమెంటు సమావేశాల్లో 23 రోజుల ప్రతిష్టంభనకు చాలా వరకు తమిళనాడు ఎంపీల ఆందోళనే కారణం. అన్నాడిఎంకే ఎంపీల ఆందోళనను వెనకుండి బీజేపీ నడిపించిందనే విమర్శలు ఉన్నా సొంత రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో మాత్రం వారు బాగా కష్టపడ్డారు రాజకీయ పార్టీలు కూడా ఒక్కటయ్యాయి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన రజనీకాంత్‌., కమల్‌హాసన్‌లు కూడా తమ ప్రాంత ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో గట్టిగా పోరాటం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను కావేరి బోర్డు ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తున్నారు. ఏపీలో మాత్రం అలాంటి వాతావరణం కనిపించదు. పవన్‌ కళ్యాణ్‌ ఉన్నా ఆయన క్రియాశీల రాజకీయాల్లో భాగంగా ఉద్యమిస్తుండటంతో ఆయన పోరాటాన్ని పరిశ్రమ మొత్తానికి ఆపాదించలేం. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం హైదరాబాద్‌లోనే ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వ్యవహారాలతో తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరించడమే అసలు విషాదం.

Related Posts