ఢిల్లీలో ఏపీ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయ్.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలపై టీడీపీ నేతలు మండిపడుతున్న ఏడుగురు సభ్యులంటే కేవలం లోక్‌సభ సభ్యులు మాత్రమే రాజీనామా చేశారని.. రాజ్యసభ సభ్యులు ఎందుకు రాజీనామా చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు డ్రామాలేనన్న టీడీపీ.. కేసుల భయంతోనే ఇద్దరు రాజ్యసభ సభ్యులు బ్యాక్‌స్టెప్ వేశారంటున్నారు. ఇంతకీ వైసీపీ ఎంపీల రాజీనామాల్లో నిజాయితీ ఎంత? లెట్ వాచ్ ది స్టోరీ..ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు. అంతేకాదు.. ఏపీ భవన్ వేదికగా దీక్ష కూడా చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. వైసీపీలో మొత్తం ఏడుగురు ఎంపీలున్నారు. చేస్తేగీస్తే మొత్తం ఏడుగురు రాజీనామాలు చేయాలి కానీ లోక్‌సభ సభ్యులు ఐదుగురు మాత్రమే రాజీనామా చేశారు. ఆ తర్వాత ఏపీ భవన్ వేదికగా దీక్షకు దిగారు. వీరి దీక్షకు మద్దతు కూడా లభిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ వైసీపీ ఎంపీలు చేస్తున్న దీక్షకు సొంత పార్టీ ఎంపీలు అదే.. ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఇప్పటివరకు రాకుండా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయకపోవడంపై ఆపార్టీ ఎంపీల రాజీనామాలు డ్రామాలనే టాక్ వినిపిస్తోంది. రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయకపోవడం అనేది రాజకీయ నిర్ణయం అని అనుకోవచ్చు. కానీ.. ఏపీ భవన్ ఆవరణలో చేస్తున్న నిరాహార దీక్షలో కూడా ఈ ఇద్దరు ఎంపీలు లేకపోవడం చర్చనీయాంశంగా ఉంది. అయితే వారు చేస్తున్న దీక్షకైనా మద్దతు ఇవ్వాల్సిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు నాలుగు రోజులు దాటుతున్నా ఇప్పటి వరకు ఆ ఛాయలకు కూడా వెళ్లలేదు. ఎంపీల దీక్ష వద్దకు వెళ్తే.. మీరెందుకు రాజీనామాలు చేయలేదు.. దీక్షలో ఎందుకు కూర్చోలేదనే ప్రశ్నలు వేస్తారని.. వాటిని ఎదుర్కోవడం కన్నా సైలెంట్‌గా ఉంటే బాగుంటుందని ఎంపీలు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకనే వారిద్దరు ఎంపీల దీక్షకు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. అయితే రాజ్యసభ ఎంపీల నుంచి సొంతపార్టీ నేతల దీక్షకు మద్దతు లేకపోవడాన్ని చిత్రమైన పరిణామంగా భావిస్తున్నారు ఏపీ ప్రజలు. మరోవైపు రాజకీయ మైలేజీ కోసమే వైసీపీ రాజీనామాల డ్రామాలు ఆడుతుందనే టాక్ కూడా వినిపిస్తోంది. అదేసమయంలో విజయసాయిరెడ్డి కేసుల భయంతోనే రాజీనామా చేయలేదన్న మాట కూడా వినిపిస్తోంది. తమపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికి ప్రధాని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. వైసీపీ ఎంపీల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కేసుల మాఫీ కోసం నాటకాలాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే విజయసాయి పీఎంవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారంటూ ద్వజమెత్తారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని విరుచుకుపడుతున్నారు.