YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

మిడి మిడి జ్ఞానం.....

మిడి మిడి జ్ఞానం.....

మిడి మిడి జ్ఞానం.....
ఒక రోజు ఓ (ఎన్ ఆర్ ఐ) సైంటిస్ట్, ముసలి వారైన అతని తల్లి తండ్రులను కాశీ పట్టణం కి తీసుకోని వెల్లాడు. అయితే ఆ రోజు సాయంత్రమున పెద్ద వారి ఇద్దరిని గుడికి పంపీ ఇతడు మాత్రం అలా గంగానది వడ్డున ఘాట్ లంపట తిరుగుతూ.. అక్కడ నదీ వడ్డున కూర్చుని వున్న ఒక సాధువును చూసాడు.
ఆ సాధువు దగ్గరకు వెళ్ళి పక్కన కూర్చుని.. సైంటిస్ట్ అన్న అహం తో ఆ సాధువుతో ఎలా మాటలు కలపాలో తోచక సతమతమౌతున్నాడు. అప్పుడు ఆ సాధువు ఇలా అడిగారు.. 
బాబు.. ఎదైనా చెప్పాలా.. దేనికి సంకోచిస్తున్నావు..!? అప్పుడు ఆ (ఎన్ ఆర్ ఐ) సైంటిస్ట్.. 
అయ్యా.. నేను ఒక జన్యు శాస్త్రజ్ఞుడను, నేను మానవ పరిణామం పై అమెరికాలో పని చేస్తున్నాను, పరిణామ సిద్ధాంతం, చార్లెస్ డార్విన్, మీరు అతని గురించి విన్నారా.. అని అడిగాడు.
అప్పుడు ఆ సాధువు నవ్వి.. నాకు డార్విన్ గురించి తెలుసు, కానీ నీవు ఇక్కడ(భారత దేశం) పుట్టి పెరిగిన వాడివెగా.. నీవు దశావతారాల గురించి విన్నవా..? హిందూ శాస్త్రం ప్రకారం విష్ణువు యొక్క పది అవతారాలు అవి..?
అయ్యా.. అవి నాకు తెలియదు కాని మిస్టర్ డార్విన్ పరిణామ క్రమం మాత్రమే తెలుసు. అన్నాడు ఆ సైంటిస్ట్.
ఐతే సరే జాగ్రత్తగా విను.. అన్నారు ఆ సాధువు.. 
దీనిలో మొట్ట మొదటి అవతారం మాత్స్యా అవతారం, అంటే చేప. ఎందుకంటే జీవితం నీటిలో మొదలైంది..
సైంటిస్ట్ కొంచెం శ్రద్ధతో వినటం మొదలు పెట్టాడు..
అప్పుడు కుర్మావతరం వచ్చింది. అంటే తాబేలు, జీవితం నీటి నుండి భూమి తరలించబడింది ఎందుకంటే ఉభయచరం కాబట్టి తాబేలు సముద్రం నుండి పరిణామం సూచిస్తుంది.
మూడోది వరాహా అవతారం. అంటే అడవి పంది, ఇది అంతగా మేధస్సు లేని జంతువులను సూచిస్తుంది, మీరు వాటిని డైనోసార్స్ అని పిలుస్తారు కదూ..? 
సైంటిస్ట్ కు చాలా ఆశ్చర్యం వేసింది..
నాల్గవ అవతారం నరసింహ అవతారం, సగం మనిషి మరియు సగం జంతువు, అడవి జంతువుల నుండి పరిణామం వరకు తెలివైన వ్యక్తులు.
ఐదవది వామన అవతారం, మిడ్గేట్ లేదా మరగుజ్జు, అప్పుడు పొడవుగా పొట్టిగా వుండే రెండు రకాల మానవులు వుండేవారు, హోమో ఎరెక్టస్ మరియు హోమో సేపియన్స్..
సైంటిస్ట్ ఆ సాధువు విశ్లేషణ లో పూర్తిగా లీనమైపోయాడు...
ఆరవ అవతారం పరశురాముడు. అటవీ నివాసి గొడ్డలి కలిగిన వ్యక్తి, అతడు సామాజికంగా పరిపూర్ణత లేని వ్యక్తి.
ఏడవ అవతారం శ్రీ రాముడు, సమాజం యొక్క చట్టాలు మరియు అన్ని సంబంధాల ఆధారంగా నిర్మించిన మొట్ట మొదటి ఆలోచన ఒక నిర్థిష్టమైన సామాజిక మనుగడ.
ఎనిమిదవ అవతారం బలరాముడు, నిజమైన రైతు జీవితం యొక్క వ్యవసాయ విలువను చూపించారు.
తొమ్మిదవ అవతారం, శ్రీకృష్ణుడు రాజనీతిజ్ఞుడు, రాజకీయవేత్త, సమాజపు ఆటగాడిగా వ్యవహరించిన ప్రేమికుడు మరియు సామాజిక నిర్మాణంలో జీవించి ఎలా వృద్ధి చెందాలని బోధించాడు 

చివరకు, కల్కి అవతారం. అత్యంత సమర్ధమైన పని చేస్తున్న మనిషి వస్తారు. జన్యుపరంగా అత్యున్నత మైన వ్యక్తి... అని చెప్పి మౌనము గా వున్నారు ఆ సాధువు.. ఆ సైంటిస్ట్ నోట మాట లేదు.. కొంతసేపటికి తేరుకున్న సైంటిస్ట్.. అయ్యా.. ఈ విశ్లేషణ అద్భుతముగా ఉంది అనగా.. అప్పుడు ఆ సాధువు.. బాబు.. మన భారతీయులకు ఈ విషయాలన్నీ ప్రాచ్యత్త దేశాలు సరిగా గుడ్డలు కప్పుకోలేని సమయం లొనే తెలుసు. కానీ ఎలా శాస్త్రీయంగా వివరించాలో తెలియదు, కాబట్టి వాటిని పౌరాణిక కథలలోకి తీసుకువచ్చారు, ఇదే పురాణశాస్త్రం యొక్క గొప్పదనం..సృష్టి లో ఉన్న ఎన్నో జీవులు ఇలాగే ఉదవించాయి, అందుకే మనం జీవకోటి అంటాము, అంటే మనము కూడా ఈ అనంత కోటి జీవాలలో ఒక రకమైన జీవులం అంతే.. కొన్ని మతాలు మనిషిని దేవుడు మట్టి నుండి తయారు చేసాడు అని చెప్తాయ్ కానీ కోటి పైగా ఉన్న జీవ రాసులను గురించి చెప్పవు, చెప్పలేవు కానీ మనం పంచ భూతాలు ఐన భూమి, గాలి, నీరు, ఆకాశం, నిప్పు లను పూజిస్తాం ఎందుకంటే అవి లేకుంటే మనకు అంటే సమస్త జీవకోటికి జీవనం లేదు కదా.. ఐనా... ఎక్కడికో వెళ్లి ఏదో తెలుసుకొని ఎవరినో ఉద్దరించాలి అనుకునె ముందు.. నీవు పుట్టిన నీ హిందూ సనాతన ధర్మమును గురించి పూర్తిగా తెలుసుకొని, మన హిందూ సనాతన ధర్మము యొక్క గొప్పతనం ప్రపంచానికి చాటు.. అని అన్నారు...

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో
 

Related Posts