YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

 గ్లామర్ డోస్ పెంచేసిన  నిహారిక

 గ్లామర్ డోస్ పెంచేసిన  నిహారిక

 గ్లామర్ డోస్ పెంచేసిన  నిహారిక
హైద్రాబాద్, జూన్ 2,
కొణిదెల వారసురాలు, మెగా డాటర్ నిహారిక రూటు మార్చేసింది. ఇన్నాళ్లు పద్ధతైన దుస్తుల్లో కనిపించిన ఈమె ఇప్పుడు తన అందాల తలుపులు తెరిచేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఆ అందాలను వడ్డిస్తోంది. ఆమె పోస్ట్ చేస్తున్న లేటెస్ట్ ఫోటో షూట్స్, నిహారిక గ్లామర్ ట్రీట్ చూసి వావ్! మెగా డాటర్ ఈ రేంజ్‌లో కూడా కిక్కిస్తుందా అని పరేషాన్ అవుతున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే తాజాగా తులిప్ మ్యాగజైన్ కోసం చేసిన ఓ ఫోటో షేర్ చేసి స్పెషల్ కిక్కిచ్చింది. తులిప్ మ్యాగజైన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా నిహారిక గ్లామర్ లుక్‌ని కవర్ పేజీపై ముద్రించారు. ఈ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన మెగా డాటర్.. తులిప్ మ్యాగజైన్ 10వ వార్షికోత్సవ ఎడిషన్‌పై తన ఫోటో ప్రింట్ చేయడం సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ ఫోటోలో బ్యాక్‌లెస్ పోజిస్తూ కనిపిస్తోంది నిహారిక. మత్తెక్కించే కళ్ళు, ఆమె చూస్తున్న చూపు నెటిజన్ల గుండెల్లో గుచ్చుకుంటోంది. ఆమెను ఇలా చూసి ఫిదా అవుతున్న నెటిజన్స్ ‘‘సూపర్, గ్లామర్ బ్యూటీ’’ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్ అయింది.ఇన్నాళ్లు పద్దతిగా కెమెరా ముందు కనిపించిన నిహారిక.. ఇక సినిమాలు, వెబ్ సిరీస్ ఏదైనా అందాలు ఆరబోసేందుకు రెడీ అని అంటోంది. గ్లామర్ రోల్స్ చేస్తానని, కథ డిమాండ్ చేస్తే అందాల విందుకు వెనుకాడేది లేదని చెబుతోంది. ఇప్పటిదాకా ఆమె హీరోయిన్‌గా చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. మరోవైపు నిహారిక పెళ్లి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టామని ఆమె తండ్రి నాగబాబు ఇటీవలే ప్రకటించారు. సో.. చూడాలి మరి రానున్న రోజుల్లో మెగా డాటర్ గ్లామర్ ట్రీట్ ఏ రేంజ్‌లో ఉండనుందో!.

Related Posts