YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సంతకు స్థలం కావాలి

సంతకు స్థలం కావాలి

కరీంనగర్ జిల్లాల్లోని శంకరపట్నం మండలంలో సంత స్థానికులుకు పెద్ద ఇబ్బందిగా మారింది. వ్యాపారులు క్రమంగా జాతీయ రహదారిపైకి విస్తరిస్తుండడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. గతంలో ఈ సంతలో కేవలం దస్తులు మాత్రమే విక్రయించేవారు. రోడ్డుపై జనసమ్మర్థం పెరుగుతోంది. మరో వైపు రోడ్డుపై వాహనాలు వేగంగా వస్తుంటాయి. సంత జరిగే రోజు ఎక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతాయో అని పోలీసులు హైరానా పడుతున్నారు. రోడ్డుపై జనంతో పాటు వాహనాల రద్దీని అదుపు చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. చుట్టు పక్కల ఇండ్ల యజమానులు కూడా అంగడి రోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా రోడ్డుపై వ్యాపారం నిర్వహించడానికి తాము ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు సైతం వాపోతున్నారు. ఇటీవల బస్టాండ్‌కు మరమ్మతులు చేపట్టారు. మార్కెట్ గోదాం నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చింది. ఈ రెండు వినియోగంలోకి వస్తే ఇక్కడ వ్యాపారాలు నిర్వహించే అవకాశం ఉండదు. ఆలోగా వారసంతకు ప్రత్యేకంగా స్థలం కేటాయించి వ్యాపారాలు సజావుగా సాగేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని వ్యాపారులు కోరుతున్నారు.అప్పట్లో సిరిసిల్లకు చెందిన వస్త్ర వ్యాపారులు ఇక్కడికి వచ్చి తమ వ్యాపారాలు నిర్వహించేవారు. రాను రాను దుస్తులతో పాటు కూరగాయలు, పండ్లు, రకరకాల వస్తువులు మార్కెట్ వేదికగా క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. ప్రతీ సోమవారం పెద్ద ఎత్తున ఇక్కడ వ్యాపారం జరుగుతోంది. దుస్తులు, కూరగాయలు, పండ్లు తదితర వస్తువులు చవకగా లభిస్తుండడంతో చుట్టు పక్కల మండలాల ప్రజలు సైతం ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. దీంతో జనం కిక్కిరిసిపోతున్నారు. ఓ వైపు బస్టాండ్, మరో వైపు మార్కెట్ యార్డు ఉంది. స్థలం పరిమితంగా ఉండడంతో వ్యాపారులు ప్రధాన రహదారికి ఇరువైపులా కూర్చొని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

Related Posts