YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

 రెండు తెలుగు రాష్ట్రాలపై కమలం గురి

 రెండు తెలుగు రాష్ట్రాలపై కమలం గురి

 రెండు తెలుగు రాష్ట్రాలపై కమలం గురి
హైద్రాబాద్, జూన్ 3,
బీజేపీ ఆశ చాలానే ఉంది. కానీ ఆచరణలో జరగాలిగా. హిందూ కార్డుతో దేశంలో ఇప్పటికి మూడు సార్లు అధికారంలోకి వచ్చిన కమలం పార్టీకి ఎందుకో తెలుగు రాష్ట్రాల మీద వెర్రాశ బోలెడు ఉంది. ఇక్కడ జనాలు కూడా కాషాయం కప్పుకుంటారని అధిక విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కానీ చరిత్ర తిరగేస్తే బీజేపీకి ఉమ్మడి ఏపీలో ఊపిరి చాలా తక్కువ అని అర్ధమవుతోంది. కానీ కేంద్ర పెద్దల ఆదేశాలో లేక లోకల్ నేతల అతి ఉత్సాహమో తెలియదు కానీ రెండు రాష్ట్రాలో బీజేపీ కదన కుతూహలం రాగం ఆలపిస్తోంది. తమ టార్గెట్ ఏపీ, తెలంగాణా అని నేతలు బాహాటంగానే చెబుతున్నారు. దానికి వారు ఎంచుకుంటున్న మార్గమే రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో పడేస్తోంది.ఏపీలో క్రైస్తవ రాజ్యం, తెలంగాణాలో ముస్లిం రాజ్యం స్థాపన దిశగా జగన్, కేసీఆర్ పనిచేస్తున్నారట. ఈ రాజకీయ పరిశోధన చేసింది ఎవరో కాదు, తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్. ఈ ప్రకటన వెనక బీజేపీ ఆలోచనలు ఏంటి అన్నది స్పష్టంగా తెలిసిపోతోంది. హిందూ కార్డుని ఫుల్ గా వాడుతామని చెప్పేసుకుంటున్నారు కూడా. ఇద్దరు ముఖ్యమంత్రులూ హిందువులను అణచేస్తున్నారుట. అందువల్ల వారికి వ్యతిరేకంగా పోరాడుతామని, మొత్తం హిందువులను సమైక్యం చేస్తామని బీజేపీ నేతలు అంటున్నారు.మోడీ 2014, 2019లో సాధించినవి అసాధారణ విజయాలు అంటున్నారు బీజేపీ నేతలు, దేశంలో రెండు సార్లు పూర్తి మెజారిటీతో రావడం అంటే మాటలు కాదు, పైగా మూడు దశాబ్దాల తరువాత దేశంలో సంకీర్ణ రాజకీయాలకు మోడీ చరమ గీతం పాడి ఒకే పార్టీని అధికారంలోకి తెచ్చాడని అంటున్నారు. అన్ని రికార్డులూ మోడీ బద్దలుకొట్టినా రాజీవ్ గాంధీ 1984లో సాధించిన 400 పై చిలుకు సీట్ల రికార్డు అలాగే ఉందని చెబుతున్నారు. దానిని మించి 2024లో బీజేపీ సాధించాలన్నది కొత్త టార్గెట్ అంటున్నారు బీజేపీ నేతలు. దాన్ని కూడా మోడీ సాధిస్తారని ధీమాగా చెబుతున్నారు. అందుకోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 42 సీట్లు తమ పార్టీ పరం కావాలని వారు ఆశ పడుతున్నారు. దానికోసమే ఇప్పటి నుంచి బలం పెంచుకునే వ్యూహాన్ని రూపొందిస్తారుట.నిజంగా రాజకీయాలు చేసేవారు వాస్తవవాదులుగా ఉండాలి. వారు ఎక్కడో ఆకాశంలో విహరిస్తూ కలలు కంటే కుదిరే పని కానే కాదు. తెలంగాణాలో కొంత ఉనికి ఉన్నా ఏపీలో బీజేపీకి నిలువ నీడ లేదు. ఇక రెండు చోట్లా బలమైన ప్రాంతీయ పార్టీలుగా వైసీపీ, టీఆర్ఎస్ ఉన్నాయి. అదే విధంగా ఏపీలో తెలుగుదేశం, తెలంగాణాలో కాంగ్రెస్ తరువాత స్థానంలో ఉన్నాయి. మరి ఈ రాజకీయ పరిస్థితులను గమనంలోకి తీసుకోకుండా బీజేపీ 2024 మిషన్ అంటూ హిందూ కార్డుతో తెలుగు రాష్ట్రాల మీద పడిపోతే ఫలితం ఉంటుందా అన్నదే ప్రశ్న. ఇక హైదరాబాద్ తో పాటు కొన్ని చోట్ల మాత్రమే మజ్లీస్ ఉనికి ఉంది. మిగిలిన చోట్ల హిందూ కార్డు తీసినా బీజేపీకి ఒరిగేదిలేదు. ఏపీలో అయితే మైనారిటీలు కొన్ని జిల్లాలకే పరిమితం. ఇక్కడ కూడా జనం హిందుత్వ వైపు పెద్దగా మళ్ళే అవకాశం లేదు. ఇవన్నీ కళ్ళకు కనిపిస్తున్న నిజాలు, మరి వీటిని మరచి రెండు ప్రభుత్వాలను ఇంటికి పంపుదాం, హిందూ రాజ్య స్థాపన చేద్దామంటూ బీజేపీ పెద్దలు హూంకరిస్తున్నారంటే నేల విడిచి సాము చేస్తున్నట్లే లెక్క.

Related Posts