YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

 ఆర్గానిక్ డిమాండ్ మస్తు 

 ఆర్గానిక్ డిమాండ్ మస్తు 

 ఆర్గానిక్ డిమాండ్ మస్తు 
హైద్రాబాద్, జూన్ 3,
కరోనా సిటిజన్స్లో చాలా మార్పులు తీసుకొస్తోంది. ముఖ్యంగా హెల్త్ కాన్షియస్. ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్యునిటీ పవర్ పెంచుకుని, మరింత హెల్దీగా ఉండాలని ఎక్కువమంది భావిస్తున్నారు. ఆ క్రమంలో ఆర్గానిక్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నార్మల్ డేస్ తో పోలిస్తే  30 శాతం బిజినెస్ పెరిగిందని ఆర్గానిక్ స్టోర్స్ నిర్వాహకులు చెప్తున్నారు. పెరుగుతున్న హెల్త్ కాన్షియస్..సిటీలో వందల్లో ఆర్గానిక్ స్టోర్స్ ఉండగా, లాక్డౌన్కు ముందు ఓ గ్రూప్ వారు మాత్రమే వెళ్లేవారు. ఇప్పుడు చాలామంది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కెమికల్ ఫ్రీ, హెల్దీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తో పాటు నిత్యవసరాలూ కొంటున్నారు. నార్మల్ ప్రొడక్ట్తో పోలిస్తే ధర డబుల్ఉన్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక్కో స్టోర్కు డైలీ 50నుంచి60మంది కస్టమర్స్ వస్తుంటారని నిర్వాహకులు చెప్తున్నారు. మరికొందరు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే డోర్ డెలివరీ చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ గుడ్ సీడ్స్ ఆర్గానిక్ లివింగ్ స్టోర్ నిర్వాహకుడు నారాయణమూర్తి తెలిపారుశివార్లలోని షాద్ నగర్, చేవెళ్ల, శంకరపల్లి, మేడ్చల్ నుంచి సిటీలోని ఆర్గానిక్ స్టోర్స్ కి వెజిటబుల్స్, ఫ్రూట్స్ వస్తుంటాయి. ప్రస్తుతం ఎండల వల్ల గ్రౌండ్ వాటర్ పడిపోయి దిగుబడి తగ్గడంతో బెంగళూరు, మైసూర్ నుంచి ప్రొడక్ట్స్ తెప్పిస్తున్నారు. నాలుగైదు స్టోర్ల నిర్వాహకులు కలిసి ట్రక్ మాట్లాడుకుని వారంలో 2–3 సార్లు వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఒక్కో రకం వెజిటబుల్స్ 2 నుంచి 3 క్వింటాళ్లు ఉంటాయని, అలా 25 రకాలు తెప్పిస్తున్నామని వారు తెలిపారు. ఒకప్పటితో పోలిస్తే ధరలు 20 –25 శాతం పెరిగాయంటున్నారు. ట్రాన్స్ పోర్టేషన్ ఖర్చు కూడా మూడింతలవడంతో ప్రొడక్ట్స్ రేట్లు పెంచాల్సి వస్తోందని చెప్పారు. బయటి ఫామ్స్ నుంచి తెప్పించి అమ్మేవారితోపాటు సొంతంగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ను పండించి సేల్ చేసేవారూ సిటీలో ఎంతోమంది ఉన్నారు. వారు శివారు ప్రాంతాల్లో వందల ఎకరాల్లో ఆర్గానిక్ మెథడ్ లో వెజిటబుల్స్ సాగు చేస్తూ.. సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ స్టోర్స్ లో అమ్ముతున్నారు.ఆరోగ్యంపై దృష్టి పెట్టిన సిటిజన్స్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వల్ల బెనిఫిట్స్ తెలుసుకుంటున్నరు. యంగ్ స్టర్స్, మిడిల్ ఏజ్ గ్రూప్, కార్పొరేట్, ఐటీ సెక్టార్ ఇట్ల డిఫరెంట్ కేటగిరీల వాళ్లు ఆర్గానిక్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నరు. శామీర్ పేట, సిద్దిపేట దగ్గర మాకు ఫామ్స్ ఉన్నయ్. అక్కడ పండించిన ఆర్గానిక్ వెజిటబుల్స్ ను సిటీతోపాటు బెంగళూరు, ముంబయి, పుణెలో సేల్ చేస్తుంటారు

Related Posts