YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

వైద్యరంగంలో విప్లావాత్మక మార్పులు

వైద్యరంగంలో విప్లావాత్మక మార్పులు

 

వైద్యరంగంలో విప్లావాత్మక మార్పులు
పాడేరు పర్యటనలో మంత్రి అళ్ల నాని
విశాఖపట్నం జూన్ 3
రాష్ట్ర వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు చేస్తున్నామని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. బుధవారం అయన విశాఖపట్నం జిల్లా పాడేరు లో పర్యటించారు.  విశాఖపట్నం మన్యం లో గిరిజనులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని.. సత్వరమే ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మంత్రి ఆళ్ల నానిని ముఖ్యమంత్రి  జగన్మోహనరెడ్డి ఆదేశించారు. బుధవారం మంత్రి  పాడేరు లోని ప్రభుత్వ పాలిటీక్నిక్ కాలేజీ సమీపంలో ఖాళీగా ఉన్న 50ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణ దాసు, అరకు ఎంపీ మాధవి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గోన్నారు. మంత్రి రెండు రోజులపాటు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రములో ప్రస్తుతం ఉన్న 11ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అదనo గా మరో 16ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న జిల్లా హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్ ను భోధనాహాస్పిటల్స్ గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం. రానున్న మూడు సంవత్సరాలలో కొత్తగా మంజూరు అయినా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తి చేస్తాం.  రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ప్రజలకు వైస్సార్ విలెజ్ క్లినిక్లు అందుబాటులోకి రానున్నాయని అయన అన్నారు. రాష్ట్రలో ప్రతి 2వేల జనాభాను ఒక యూనిట్ గా తీసుకొని అక్కడ పరిస్థితులకు అనుగుణంగా విలెజ్ క్లినిక్ లు ఏర్పాటు చేయాలని సీఎం అదేశించారు. గ్రామ, వార్డ్, సచివాలయాలలో ఇకపై ప్రాధమిక వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వఉద్దేశ్యం. పట్టణ, గ్రామీణ, ప్రాంతాలలో ఎవరికైనా అనారోగ్యం ఏర్పడితే తక్షణమే ఉచితంగా వైద్యం అందించడానికి విలెజ్ క్లినిక్ లు దోహదపడతాయి. ప్రతి టీచింగ్ హాస్పిటల్స్ లో డెంటల్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో అత్యదునిక పరికరాలను సమకూరుస్తాము. పూర్తి స్థాయిలో వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించడానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నాం. రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సంకల్పమని ఆళ్ల నాని అన్నారు. 

Related Posts