ఎక్సైజ్ అధికారులపై గ్రామస్తుల దాడి
గుంటూరు జూన్ 3,
ఎక్సైజ్ అధికారులపై గ్రామస్తులు దాడి చేసిన సంఘటన మాచర్ల మండలం హస్నాబాద్ తండాలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. విజయపురి సౌత్ ఎస్ ఐ పాల్ రవీందర్ కథనం ప్రకారం హస్నాబాద్ తండాలో నాటుసారా అక్రమంగా తయారు చేస్తున్న బట్టి లపై దాడి చేసి 20 లీటర్ ల నాటుసారా స్వాధీన పరచుకున్నారు. దీనికి తోడు ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు గత నెలలో అదే గ్రామంలో 7 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. దీనితో గ్రామాన్ని టార్గెట్ చేసిన ఎక్సైజ్ అధికారులపై ఊహించని రీతిలో సుమారు 100 మంది వరకు గ్రామస్తులు గుమిగూడారు. అయితే వీరిలో సుమారు 15 మంది వ్యక్తులు రాళ్ళతో మాచర్ల ఎక్సైజ్ సి ఐ కొండారెడ్డి తో పాటు సిబ్బంది, వారి కారుపై దాడి చేశారు. దీనితో కొండారెడ్డి తో పాటు సిబ్బందికి గాయాలు కాగా కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.