పదో తరగతి పరీక్ష ఏర్పాటు పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ డా.శరత్
కామారెడ్డి జూన్ 03 ఈనెల 8 నుండి వచ్చే నెల 5 వ తేదీ వరకు నిర్వహించబడే పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులకు ఆదేశించారు. జిల్లాలో 102 పరీక్షా కేందాల ద్వారా 12,751 విద్యార్థులు పరీక్షలకుహాజరవుతున్నారని, ఉదయం 9-30 గంటల నుండి 12-15 గంటల వరకు పరీక్షా సమయమని తెలిపారు. పరీక్షా కేందాల వద్ద అన్ని జాగత్తలను తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్యం వద్ద హెల్త్ టీములతో విద్యార్ధులకుథర్మల్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుందని తెలపారు. విద్యార్ధులందరూ మాస్క్ లు ధరించి పరీక్షలకు హాజరు కావాలని తెలిపారు. పరీక్షలలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడం జరిగిందని, పరీక్షా కేందాలలో పరిశుభ్రతా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. పరీక్ష నిర్వహణ సమయంలో 144 సెక్షన్ అమలు, పరీక్షా సమయంలో జీరాక్సు సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఆ సి బస్సుల ద్వారా విద్యార్ధులకు రవాణా కల్పించడం జరిగిందని, పరీక్షా కేందాలలో విద్యుత్ అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.