YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సైరా లో అవంతి ఎంట్రీ

 సైరా లో అవంతి ఎంట్రీ

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు, విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌ల్లో సంద‌డి చేయ‌నున్నారు. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం టాలీవుడ్లోనే ప్రస్తుతం బాగా హైప్ ఉన్న సినిమా. అమితాబ్ బచ్చన్ - నయనతార - విజయ్ సేతుపతి వంటి స్టార్ కాస్ట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో అవకాశం రావడం అంత తేలిక కాదు. కానీ ఒక ముఖ్య పాత్ర పోషించే అవకాశం అవంతిక కు దక్కింది. అవంతిక ఎవరా అని ఆలోచిస్తున్నారా? అదేనండి బాహుబలి సినిమాలో ఆ పాత్రను పోషించిన మిల్కీ సైరన్ తమన్నా. యుద్ధ విన్యాసాలలో ప్రావీణ్యం ఉన్న అవంతిక పాత్రలో మిల్కీ బ్యూటీ ప్రేక్షకులకు తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ తో కలసి నటించబోతోంది. సై రా సినిమా భారీ బడ్జెట్ తో చిత్రీకరిస్తున్నందున తెలుగులోనే కాక వేరే భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు ప్రొడ్యూసర్ రామ్ చరణ్. అందుకే ప్రపంచం మొత్తం మీద పాపులారిటీ ఉన్న యాక్టర్లనే ఎంచుకుంటున్నారు. బాహుబలి పుణ్యమా అని మన హ్యాపీ డేస్ బ్యూటీ తమన్నా కూడా బాగానే పేరు తెచ్చుకుంది కదా. అందుకనే సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం దర్శకనిర్మాతలు ఈమెపై మొగ్గు చూపారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కూడా ఓ ముఖ్య పాత్ర పోషించ‌నుంద‌ని తెలుస్తోంది. క‌థ‌ను కీల‌క మలుపు తిప్పే పాత్ర‌ల్లో ఆమెది ఒక‌ట‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే త‌మ‌న్నా ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Related Posts