రెచ్చిపోయిన కామాంధులు
తిరుపతి, జూన్ 3,
కామంధులు మరోమారు రెచ్చిపోయారు. బాలికపై కన్నేసిన కామపిశాచులు ఒంటరిగా ఉండడం చూసి దారుణానికి పాల్పడ్డారు. కామంతో కళ్లుమూసుకుపోయి పశువుల్లా మీద పడి అఘాయిత్యానికి యత్నించారు. కామవాంఛ తీర్చుకునేందుకు విఫల యత్నం చేశారు. బాలిక పెద్దగా కేకలు పెట్టడంతో సమీపంలోని గ్రామస్థులు ఆమెను రక్షించారు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.బి.కొత్తకోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(13)పై అత్యాచార యత్నం చేశారు ఇద్దరు దుర్మార్గులు. బాలిక బహిర్భూమికి వెళ్లడం గమనించిన అదే గ్రామానికి చెందిన చల్లా వెంకటేష్(30), బత్తల చలపతి(22) ఆమెను అడ్డుకున్నారు. ఒంటరి బాలికను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచార యత్నం చేశారు. కామంతో ఆమెపై పడి పశువాంఛ తీర్చుకునేందుకు యత్నించారు. కామాంధుల దుర్మార్గపు చర్యను బాలిక తీవ్రంగా ప్రతిఘటిస్తూ పెద్దగా కేకలు వేసింది. అరుపులు విన్న సమీపంలోని గ్రామస్థులు అక్కడికి చేరుకునేలోపు బాధితురాలిని అక్కడే వదిలేసి నిందితులు పరారైనట్లు తెలుస్తోంది. అనంతరం బాలికను సురక్షితంగా ఇంటికి చేర్చారు. నిందితులకు పాతనేరచరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరు నిందితులపై అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.