YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అల్లకల్లోలంగా ముంబై సముద్రం

అల్లకల్లోలంగా ముంబై సముద్రం

అల్లకల్లోలంగా ముంబై సముద్రం
ముంబై, జూన్ 3, 
అరేబియా సముద్రంలో ఏర్పడ్డ ‘నిసర్గ’ తుఫాన్ తీవ్ర తుఫాన్‌గా మారి తీరాన్ని తాకింది. మహారాష్ట్రలోని రాయగడ్‌ జిల్లా అలీబాగ్‌ సమీపంలో బుధవారం (జూన్ 3) మధ్యాహ్నం 1.30 తర్వాత నిసర్గ తుఫాన్ తీరం దాటింది. తీరం దాటే ప్రక్రియ 3 గంటల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 110 కి.మీ. వేగంతో పెను గాలులు వీశాయి. తుఫాన్ ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో హై అలర్ట్ విధించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలు సహాయ చర్యలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దేశ వాణిజ్య నగరం ముంబైపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. దశాబ్ద కాలం తర్వాత ముంబై నగరంపై తుఫాన్ ప్రభావం చూపుతుండటం గమనార్హం. ముంబైలో 10840 మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు.ముంబైలో 144 సెక్షన్‌ విధించారు. రెండు రోజుల పాటు ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలతో పుణేలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌, రత్నగిరి, పాల్‌గర్‌, సింధు, దుర్గ్‌, థానే జిల్లాలపై తుఫాన్ ప్రభావం అధికంగా ఉండనుంది.తుఫాన్ తీరం దాటే సమయంలో సముద్ర అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. తీర ప్రాంతంలోని పలు ఇళ్లు, నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. తుఫాన్ కారణంగా ముంబై, గోవా తీర ప్రాంతాల్లో రహదారులు ఇప్పటికే మూసుకుపోయాయి
 

Related Posts