YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రికార్డుల వర్షం కురిపిస్తున్న బ్లాక్ పాంథర్

రికార్డుల వర్షం కురిపిస్తున్న బ్లాక్ పాంథర్

మార్వేల్ స్టూడియోస్ నిర్మించిన తాజా చిత్రం బ్లాక్ పాంథర్.. గత వారం అమెరికాలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తొంది..మార్వెల్ కామిక్స్ ఆధారంగా తెర‌కెక్కిన అమెరిక‌న్ సూప‌ర్ హీరో ఫిలిమ్ ‘బ్లాక్ పాంథ‌ర్‌’. రియాన్ కూగ్లేర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఫిబ్ర‌వ‌రి 16న విడుద‌లైన ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ ప్రేమికుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. క‌లెక్ష‌న్‌ల‌లో కూడా దూసుకుపోతూ.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌త్తా చాటుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు $1.29 బిలియ‌న్ క‌లెక్ష‌న్‌ల‌ను సాధించి ప్ర‌పంచంలో టాప్ 10 చిత్రాల్లో ఒక‌టిగా నిలిచింది. అంతేగాకుండా.. నార్త్ అమెరిక‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద టాప్ 3లో స్థానం సంపాదించింది. ‘స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేక‌న్స్’ ($936.7) మొద‌టి స్థానంలో ఉండ‌గా.. ‘అవ‌తార్’ ($760.5) రెండో స్థానంలో నిలిచింది. అంత‌కుముందు మూడో స్థానంలో ‘టైటానిక్’ ($659.4) ఉంటే.. ఇప్పుడు  'టైటానిక్‌'ను వెన‌క్కినెట్టి ‘బ్లాక్ పాంథ‌ర్’ ($665.4) ఆ మూడో స్థానాన్ని ఆక్ర‌మించుకుంది. మరి ఆ సినిమా ఇప్పటి వరకు ఎంత వసూల్ చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..మార్వేల్ కామిక్స్ లో భాగంగా వచ్చిన అమెరికన్ సూపర్ హీరో సినిమా బ్లాక్ పాంథర్.. ఇంతక ముందు చూసుకుంటే మర్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన డెడ్ పూల్ చాల మంచి హిట్ అయింది, ఆ సినిమా చూసుకుంటే చనిపోయాడు అనుకున్న హీరో ఫుల్ పవర్స్ తో తిరిగి వస్తాడు ఆక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గ వచ్చినా సినిమా ని యూత్ బాగా ఎంజాయ్ చేసింది, ఇప్పుడు అదే తరహా డెడ్ పూల్ 2 కూడా రిలీజ్ చేస్తున్నారు , డెడ్ పూల్ 2 ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు ఆ ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ అంత ఇంత కాదు. 

Related Posts