YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

 ఇంటర్ సిలబస్ లో మార్పులు

 ఇంటర్ సిలబస్ లో మార్పులు

 ఇంటర్ సిలబస్ లో మార్పులు
హైద్రాబాద్, జూన్ 3,
వచ్చే విద్యా సంవత్సరం (2020-21) కళాశాలలు పున:ప్రారంభమైన తొలి రోజు నుంచే మారిన సిలబస్‌కు అనుగుణంగా పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ఇంటర్‌ బోర్డు ప్రయత్నాలు ప్రారంభించింది.ఇంటర్‌ రెండో సంవత్సరం హిస్టరీ, ఎకనామిక్స్‌, కామర్స్‌, సివిక్స్‌, జాగ్రఫీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ సిలబస్‌ను పూర్తి స్థాయిలో మార్చాలని ఇంటర్‌ విద్యా పాలక మండలి ప్రతిపాదించింది.ఇంటర్ సెకండ్ ఇయర్ హ్యుమానిటీస్‌ సబ్జెక్టుల సిలబస్‌ మార్పుకు సంబంధించి వివిధ యూనివర్సిటీలు, డిగ్రీ, జూనియర్‌ కాలేజీల అధ్యాపకులు, విద్యారంగ నిపుణుల కమిటీలు చర్చలు జరిపి పాఠ్యాంశాలను రూపొందించాయి. అతి త్వరలో ఇందుకు ఆమోదముద్ర వేసి పాఠ్యపుస్తకాల ముద్రణకు సిద్ధం కావాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది.మారుతున్న సిలబస్‌ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, రాజకీయ అంశాలు వంటి పూర్తి వివరాలను పాఠ్యాంశాలుగా పొందుపరుస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ తెలిపారు.మారుతున్న పరిస్థితులు అనుగుణంగా జాతీయస్థాయిలో పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు వీలుగా హ్యుమనిటీస్‌ సిలబస్‌ను పూర్తిస్థాయిలో మార్చాలని నిర్ణయించినట్లు సమాచారం.ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి అయిదేళ్లకు సిలబస్‌ను మార్చాలని గతంలోనే నిర్ణయం జరిగింది. 2019-20 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌కి సంబంధించిన హ్యుమనిటీస్‌ సబ్జెక్టుల సిలబస్‌ను మార్చిన ఇంటర్‌బోర్డు ఈ ఏడాది సెకండియర్‌ సిలబస్‌ను మారుస్తోంది.అలాగే ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ సబ్జెక్టుల సిలబస్‌ను కూడా ఈ విద్యా సంవత్సరం మార్చాల్సి ఉండగా జాతీయస్థాయిలో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విద్యార్థులకు సిలబస్‌ను మార్చే ఎన్‌సీఈఆర్‌టీ ముందుకు రాకపోవడంతో ఆ నిర్ణయం వాయిదా వేశారు
రెండో వారంలో ఫలితాలు
కరోనా లాక్ డౌన్ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఇంటర్‌ ప్రశ్నపత్రాల మూల్యాంకనం వేగంగా కొనసాగుతోంది. జూన్ రెండోవారంలో ఫలితాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.దీంతో వాల్యుయేషన్ ప్రక్రియను ఈ నెలాఖరుతో పూర్తి చేసేలా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వాల్యుయేషన్‌తో పాటు ఓంఎంఆర్ స్కానింగ్ ప్రాసెస్ కూడా ఏకకాలంలో పూర్తి చేస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు. ఈ ఏడాది తొలుత సెకండియర్‌ ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. గత కొన్నేళ్లుగా ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల చేసే ఇంటర్‌ బోర్డు ఈ సారి మార్చనుంది.మరో మూడు నాలుగు రోజుల్లో ఫస్టియర్‌కి సంబంధించిన పేపర్‌ వాల్యుయేషన్‌ కూడా పూర్తవుతుందని సమాచారం. రిజల్ట్స్ ప్రాసెస్ను వారం, పది రోజుల్లో పూర్తి చేయనున్నారు

Related Posts