YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

 భార్యను చంపి,,భర్త ఆత్మహత్య

 భార్యను చంపి,,భర్త ఆత్మహత్య

 భార్యను చంపి,,భర్త ఆత్మహత్య
పుదుచ్చేరి, జూన్ 3,
కుటుంబ కలహాలతో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన పుదుచ్చేరిలో జరిగింది. పుదుచ్చేరి ముత్యాలపేటనగర్‌‌కు చెందిన సుబ్రమణి(41) జాలరి. అతడికి భార్య మేనక(36), ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న సుబ్రమణి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వారం రోజులుగా భార్యతో తరుచూ గొడవపడుతూ చికాకు పెడుతున్నాడు. ఉదయం భార్యభర్తలు ఆస్పత్రికి వెళ్లొచ్చాక గొడవ పడ్డారు. తర్వాత మేడపైన గదికి వెళ్లిన సుబ్రమణి మధ్యాహ్నం వేళ నిద్రపోతున్న మేనక తలపై గ్యాస్ సిలిండర్‌తో కొట్టి చంపేశాడు.ఈ ఘటన కళ్లారా చూసిన ఇద్దరు పిల్లలు ఏడవడంతో వేరే గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. చిన్నారులు కేకలు విని చుట్టుపక్కల వారు ముత్యాలపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇంటి లోపలికి వెళ్లి చూడగా మేనక విగతజీవిగా పడి ఉంది. వేరే గది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా సుబ్రమణి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుబ్రమణి మానసిక ఒత్తిడితోనే భార్యను చంపాడా? లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల మరణంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.

Related Posts