రంగులు తీయాల్సిందే
న్యూఢిల్లీ, జూన్ 3,
సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఏపీలో గ్రామ పంచాయితీ కార్యాలయాల రంగుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కీలక తీర్పు వెల్లడించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. గ్రామపంచాయితీలపై వేసిన రంగుల్ని నాలుగు వారాల్లో తొలగించాలని ఆదేశించింది. వైసిపి జెండా రంగులు కాదని వాదనలు వినిపించింది రాష్ట్ర ప్రభుత్వం.నాలుగు వారాల్లో వేసిన రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కారణగా పరిగణించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాల రంగులపై రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 623ని రద్దుచేసిన హైకోర్టు. దీనిపై సుప్రీంకోర్టు మెట్లెక్కింది జగన్ సర్కార్. అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ జెండాను పోలిన రంగులను నాలుగు వారాల్లో తొలగించకపోతే.. కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సి వుంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.