YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో కమలం తప్పటడుగులు

ఏపీలో కమలం తప్పటడుగులు

ఏపీలో కమలం తప్పటడుగులు
విజయవాడ, జూన్ 4,
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి నానాటికి దిగజారుతుంది. నాడి గమనించకుండా గుడ్డిగా ముందుకు వెళుతుండటంతో కాంగ్రెస్ కంటే ఘోరంగా బీజేపీకి భవిష్యత్తులో అవమానాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. బీజేపీ కేంద్ర నాయకత్వం బలంగా ఉంది. దేశంలో మోదీ ఇమేజ్ రోజురోజుకూ పెరుగుతుంది. కానీ ఏపీలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంది. రాష్ట్రానికి ఏ రకమైన సాయం చేయకపోవడంతో కాంగ్రెస్ తరహాలోనే బీజేపీపైనా ఏపీ ప్రజల్లో అసంతృప్తి ఉందన్నది వాస్తవం.నిజానికి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదుకోలేదు. దీనికి తోడు ప్రస్తుతమున్న ప్రభుత్వంపై ఏపీ బీజేపీ విమర్శలుచేయడం కూడా పార్టీ ఎదగలేకపోవడానికి ఒక కారణంగా చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కరోనా టెస్టింగ్ కిట్స్ పై ఆరోపణలు చేశారు. అయితే కేంద్ర నాయకత్వం జోక్యంతో కన్నా లక్ష్మీనారాయణ దాని నుంచి వెనక్కు తగ్గినట్లే కన్పిస్తుంది.కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధర కంటే తక్కువగానే కొనుగోలు చేశామని ప్రభుత్వం చెప్పడం, అందుకు డాక్యుమెంట్లు రిలీజ్ చేయడంతో బీజేపీ వాయిస్ కరోనా కిట్ల విషయంలో ఇక విన్పించడం లేదు. దీంతో పాటు బీజేపీ నిధులను కన్నా లక్ష్మీనారాయణ, పురంద్రీశ్వరిలు కలసి స్వాహా చేశారన్న వైసీపీ రివర్స్ అటాక్ కు కూడా బీజేపీ డైలమాలో పడిపోయినట్లయింది. టీడీపీ నాయకత్వంతో కలసి కన్నా లక్ష్మీనారాయణ పనిచేస్తున్నారన్న ప్రచారం ఊపందుకోవడంతో పార్టీకి భారీగా డ్యామేజీ అయిందనే కేంద్ర నాయకత్వం సయితం భావిస్తుంది.బీజేపీ కేంద్ర నాయకత్వానికి వైసీపీ సహకారం అవసరం. వివిధ బిల్లుల విషయంలో వైసీపీ మద్దతు భవిష్యత్తులో అవసరం అవుతుంది. అందుకే కేంద్ర నాయకత్వం వైసీపీతో సఖ్యతగానే వెళ్లాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ రెండు వర్గాలుగా విడిపోవడం, పార్టీ నాయకత్వం పటిష్టంగా లేకపోవడంతో ఇక ఏపీ బీజేపీ రాష్ట్రంలో కోలుకోలేదన్నది వాస్తవం. మరి బీజేపీ నేతలు ఇప్పటికైనా పాఠాలు నేర్చుకుని పార్టీ పటిష్టతకు కృషి చేస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.

Related Posts