YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఎల్జీ పాలిమర్స్ బాధితుల సంగతేంటీ

ఎల్జీ పాలిమర్స్ బాధితుల సంగతేంటీ

ఎల్జీ పాలిమర్స్ బాధితుల సంగతేంటీ
విశాఖపట్టణం, జూన్ 4,
ఎల్‌జి పాలిమర్స్‌ నుంచి స్టైరీన్‌ విషవాయువు లీకైన ఘటనలో అదే రోజు 12 మంది మృతి చెందగా, గత నెల 27న పాల వెంకయ్యమ్మ (78), ఈ నెల ఒకటో తేదీన యలమంచిలి కనకరాజు (45) మృతి చెందారు. దీంతో, మృతుల సంఖ్య 14కు చేరింది. దీన్నిబట్టి సంఘటన జరిగి 25 రోజులు పూర్తవుతున్నా బాధితులను స్టైరీన్‌ ప్రభావం వెంటాడుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభావిత ఐదు గ్రామాల్లో ప్రతిరోజూ ట్యాంకర్లతో వాటర్‌ స్ప్రే చేస్తామని ఎల్‌జి.పాలిమర్స్‌ యాజమాన్యం ఇచ్చిన హామీని వారం రోజులకే పరిమితమైంది. బాధిత వెంకటాపురం గ్రామాన్ని స్టైరీన్‌ వాసన ఇంకా వీడలేదు. విషవాయువు ప్రభావిత గ్రామాల ప్రజలు నీరసం, కడుపు ఉబ్బరం, పనిచేయలేకపోవడం వంటి అనారోగ్య సమస్యలతో నేటికీ సతమతమవుతున్నారు. స్టైరీన్‌ ప్రభావిత గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని, ప్రత్యేకంగా వైద్యున్ని కేటాయిస్తామని, గ్యాస్‌ ప్రభావిత ఐదు గ్రామాల్లోని పది వేల మందికి హెల్త్‌ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హమీలు నేటికీ అమలుకు నోచుకోలేదు.గ్యాస్‌ లీకేజీల వల్ల అస్వస్థతకు గురై కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్న 580 మందిని ఎంత వేగంగా ఇళ్లకు పంపించేసి అంతా బాగుందనే ప్రచారం కోసం ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన్యత ఇచ్చింది. 25 రోజులు దాటినా వెంకటాపురంలో చెట్ల మధ్యన, ఊర్లో గోడలకు, ఎల్‌.జి.పాలిమర్‌్‌స పరిశ్రమ గోడలకు ఇంకా స్టైరీన్‌ పదార్థం ఉండిపోవడంతో గాలి వీచేటప్పుడు వచ్చే వాసనతో ఇబ్బంది పడుతున్నామంటూ స్థానికులు వాపోతున్నారు. ఇంకా ఎంతమంది బలి కావాల్సి ఉంటుందోనంటూ భయాందోళన చెందుతున్నారు.స్టైరీన్‌ను పీల్చి తీవ్ర ప్రభావానికి లోనైనవారు అప్పుడే మృతి చెందారు. కొద్దిగా పీల్చిన వారు రికవరీ అయినా, ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రమాదానికి ముందు మారిది వాతావరణంలో ప్రజలు జీవించడానికి అనువైన పరిస్థితిని కల్పించడంలో కంపెనీ యాజమాన్యం విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి

Related Posts