YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చిక్కులు వీడేనా..?

చిక్కులు వీడేనా..?

చిక్కులు వీడేనా..? (కృష్ణాజిల్లా)
మచిలీపట్నం, జూన్ 03 ప్రభుత్వం రైతుభరోసా పథకంలో భాగంగా అందిస్తున్న పెట్టుబడి సాయం పొందడానికి కొందరు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే అర్హులు ఖాతాలకు సాయం జమ అయ్యింది. ఇంకా చాలామంది ధరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 3.45 లక్షల సాగు విస్తీర్ణం ఉంది. ఆయా ప్రాంతాల్లో మాగాణితోపాటు గరపనేలలు, లంకభూములు కూడా ఉండటంతో వరితోపాటు ఇతర ఆరుతడి పంటలు కూడా సాగవుతుంటాయి. బందరు, పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, ముదినేపల్లి, గుడ్లవల్లేరు ఇలా జిల్లా వ్యాప్తంగా చూస్తే అత్యధికశాతం వరిపంట సాగవుతుంది. తోట్లవల్లూరు, పమిడిముక్కల, మోపిదేవి, ఘంటసాల, ఉయ్యూరు, అవనిగడ్డ మండలాల్లో ఉద్యానవన పంటలు సాగవుతాయి. పశ్చిమకృష్ణాలోని తిరువూరు, ముసునూరు, పెనుగంచిప్రోలు, గంపలగూడెం, విస్నన్నపేట లాంటి ప్రాంతాల్లో పత్తి, చెరకు, మిర్చి తదితర పంటలు సాగు చేస్తున్నారు. వీరికి రైతుభరోసా ద్వారా సాయం అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 6లక్షలకుపైబడి రైతులు ఉన్నా ప్రతిసారి వివిధ కారణాలతో వేలాదిమంది లబ్ధిపొందలేక పోతున్నారు. వివిధ కారణాలతో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1.80లక్షల దరఖాస్తులను అధికారులు తిరస్కరణ జాబితాలో పెట్టారు. వాటిలో ఎక్కువగా ఆధార్‌, భూములు సర్వే, పొలాలు ఆక్వాసాగులో ఉన్నవే ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా సాగుదారులు సాయం పొందలేక పోతున్నారు. అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు రైతులు చనిపోవడం ఆ భూమిని కుటుంబసభ్యులు తమపేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకోక పోవడంవల్ల రైతుభరోసా పొందలేక పోతున్నారు. లబ్ధి పొందలేక పోవడానికి కారణాలు తెలుసుకుని వాటిని సరిదిద్దుకుని తిరిగి దరఖాస్తు చేసుకుంటే అర్హులు అందరూ సాయం పొందడానికి అవకాశం ఉంటుంది. బ్యాంకుఖాతాకు ఆధార్‌లింక్‌ అయ్యిందా లేదా అనే చూస్తున్నారు. ఖాతాలు అన్నీ నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ)కు అనుసంధానం అవ్వాలి. ఇది లేని కారణంగా జిల్లా వ్యాప్తంగా 17వేల మంది రైతులు సాయం పొందలేకపోయినట్లు గుర్తించి ఆయా మండలాల అధికారుల ద్వారా ఈ విషయాన్ని చేరవేశారు. వారందరికీ సాయం వచ్చింది. పెండింగ్‌లో ఉంది. అలాంటివారు బ్యాంకు అధికారులను సంప్రదిస్తే ఎన్‌పీసీఐకు సంబంధించిన ఒక ప్రొఫార్మా ఇస్తారు అది పూరించి ఇస్తే పెండింగ్‌ ఉన్న సాయం ఖాతాలకు జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు.

Related Posts