వార్తలు విద్య-ఉపాధి
ఖమ్మం : మొన్న మిర్చి... నిన్న పత్తి, కంది పంటలను అమ్ముకోవటానికి అన్నదాతలు అష్టకష్టాలు పడగా...నేడు మొక్కజొన్న రైతులు అల్లాడుతున్నారు. 'మద్దతు' ధర లభించక తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవటంతో.. మార్కెట్‌లలో దళారులు ధరను తెగ్గోస్తున్నారు.. రైతులు పండిస్తున్న పంటలకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రభుత్వ మ ద్దతు ధర పత్రికలకు, ఫైళ్లకు, బోర్డులకే పరిమి తమవుతోంది. అధికార యంత్రాంగం కుమ్మక్కై మద్దతు ధరకు నీళ్లు ఒదులుతున్నా రు. ప్రస్తుత సీజన్‌లో పత్తి, మొక్కజొన్న పంటలు చేతికొచ్చే సమయమిది. పంటకు మార్కెట్‌లో మద్దతు ధ ర ఏదో ఒక సాకుతో ఎగపెడతున్నారు. పత్తి రై తు, మొక్కజొన్న రైతులు మార్కెట్‌లో నిలువు దోపిడీకి గురవుతున్నారు. పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ.4100 ఉండగా, మొక్కజొన్నకు రూ.1310 ఉంది. తేమ, దుమ్ము, రాళ్లు, రప్ప లు అంటూ రైతు కంటిలో కారం కొట్టి దళారుల కడుపు నింపుతున్నారు. మార్కెట్ యార్డుల్లో ప త్తి సీజన్‌లో ఏర్పాటు చేసే సిసిఐ కేంద్రాలు మా ర్కట్‌లో ఉన్న వ్యాపారులకు అనుగుణంగా పని చేస్తున్నాయి. పత్తిని సిసిఐ కేంద్రానికి తరలిస్తే తేమ శాతం ఎక్కువ ఉందని, ధర తక్కువ ఇస్తా మంటారు. అదే పత్తిని వ్యాపారులు కొంటారు. వారి నుండి సిసిఐ కొంటోంది. పత్తి మొక్కజొన్న ధాన్యం మార్కెట్‌కు వచ్చే సీజన్‌లో గ్రామాల్లో రాళ్ల బాట్లు వేసి నిలువు దోపిడీకి గురి చేస్తున్నా రు. గజ్వేల్, సిద్దిపేట దుబ్బాక, రామాయంపే ట్, మెదక్, నర్సాపూర్ ప్రాంతాల్లో ఈ దోపిడీకి అంతం లేదు. ప్రభుత్వం యంత్రాంగం దీనిపై కదలడం లేదు. పండించిన పంటలకు మార్కె ట్‌లో ధర లభిస్తుందన్న ఆశరైతుకు లేదు.ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవటంతో.. మార్కెట్‌లలో దళారులు ధరను తెగ్గోస్తున్నారు. క్వింటాకు రూ.950 నుంచి 1000 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో రైతులు క్వింటాకు రూ.400 నుంచి 450 వరకు నష్టపోతున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న మొక్కజొన్న రైతు మరింత అప్పుల్లోకి కూరుకుపోతున్నాడు. పంట చేతికొచ్చే దశలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18,074 ఎకరాల్లో పంట నేల వాలింది. కొద్దిపాటిగా చేతికొచ్చిన పంట ఇప్పుడిప్పుడే కల్లాల్లోకి చేరుతోంది. ఈదశలో ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్టుగా క్వింటా రూ. 1425మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దిగలేదు. దీంతో దళారులు, వ్యాపారులు తమ దందాకు పదునుపెట్టారు. ఖమ్మం మార్కెట్లో క్వింటా మొక్కజొన్నకు రూ.950 మించి చెల్లించలేదు. జెండా పాట పేరుతో ఒకటి రెండు క్వింటాళ్లను రూ. 11 వందలు, రూ.1150కి కొనుగోలు చేసి మిగిలిన సరుకు అంతా అతి తక్కువకు కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలా వ్యాపారులకు మార్క్‌ఫెడ్ పోటీ లేకపోవడంతో రైతులు అయినకాడికి అమ్ముకుని ఆరుగాలం కష్టపడ్డ శ్రమను కోల్పోయి ఇంటికి చేరుతున్నారు. గత ఖరీఫ్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 20ప్రాంతాల్లో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది. వీటి ద్వారా లక్ష్యం 56వేల టన్నులు కాగా 26వేల టన్నులు కొనుగోళ్లు చేసింది. ఈ ఏడాది ఇంకా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు నష్టాలబాట పట్టాల్సి వచ్చింది
మొక్క జొన్నకు మద్దతు ఏదీ