YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఐరోపా దేశాలే ఘోరంగా...

ఐరోపా దేశాలే ఘోరంగా...

ఐరోపా దేశాలే ఘోరంగా...
లండన్, జూన్ 4, 
ఐరోపా . . . అభివృధి చెందిన ఖండమని, అభివృద్ధిని, నాగరికతకు, సాంకేతికతకు మారుపేరన్న పేరుంది. ఇది ఎవరుా కాదనలేని సత్యం కుాడా. అదే సమయంలో ఆఫ్రికా . . . అత్యంత వెనకబడిన ఖండమన్న పేరుంది. ఆకలి, పేదరికం, వెనకబాటుతనానికి మారుపేరుగా నిలిచే ఆఫ్రికాను చీకటి ఖండమని సైతం వ్యవహరిస్తారు. కానీ కరోనా నియంత్రణలో ఆఫ్రికా ఖండం కొద్దిమేరకైనా విజయం సాధించడం విశేషం. ఈ ఖండంలోని దేశాలైన ఇధియెాఫియా, ఘనా, దక్షిణాఫ్రికా, నైజీరియా, కెన్యా వంటి దేశాలు కరోనా నియంత్రణలో ఒకింత ముందంజంలో ఉన్నాయి. కానీ అదేసమయంలో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా పేరు గాంచిన ఐరోపా ఖండం కరోనా దెబ్బకు కుదేలవుతోంది. దానిని నియంత్రించే మార్గం తెలియక దిక్కుతోచని పరిస్ధితిని ఎదుర్కొంటోంది.ఖండంలోని దేశాలన్నీ ఎంతో కొంత అభివృద్ధి చెందినవే కావడం గమనార్హం. ఐక్య రాజ్య సమితిలోని భద్రతామండలిలోని అయిదు శాశ్వత సభ్యత్వ దేశాల్లో ముాడుదేశాలు బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ ఈ ప్రాంతంలోనివే కావడం విశేషం. ఇతర దేశాలను పక్కన పెడితే అగ్రరాజ్యంగా అమెరికాను ఢీకొనే రష్యా సైతం కరోనా కట్టడిలో అచేతనంగా ఉంది. ఈ ఖండంలోని ప్రధానంగా అయిదు దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, స్పెయిన్, ఇటలీ ల్లో మరణ మృదంగం మెాగుతోంది. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని తన గుప్పెట పెట్టుకుని పాలించిన బ్రిటన్ నేడు దయనీయ పరిస్ధితిని ఎదుర్కొంటోంది. అమెరికా తర్వాత అత్యధికంగా మరణాలు నమెాదైంది ఈ దేశంలోనే. మే 17 నాటికి మెుత్తం 34,636 మరణాలతో అమెరికా తరువాతి స్ధానంలో ఉంది. స్వయంగా దేశప్రధాని బోరిస్ జాన్సన్ కరోనాతో మరణం అంచుల వరకు వెళ్ళి బతుకుజీవుడా అంటుా బయటపడ్డారు.మెుదట్లో ఇటలీలో మరణమృదంగం మెాగింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మరణాలు ఇక్కడే నమెాదయ్యాయి. ఇప్పుడు అమెరికా, బ్రిటన్ ల తరువాత మరణాల్లో మూడోస్ధానాంలో ఉంది. స్పెయిన్ 27,650 మరణాలతో నాలుగో స్ధానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జనాభా పరంగా చిన్న దేశమైనా ఇక్కడ ఈ స్ధాయిలో మరణాలు నమెాదు కావడం పౌరులను ఆందోళన పరుస్తోంది. 2,77,719 కేసులు దేశాలు వెలుగు చూశాయి. సంపన్న దేశమైన జర్మనీ ఆరంభంలో కరోనాను బాగానే కట్టడి చేసినా ఆ తరువాత చేతులెత్తేసింది. దేశ ‍ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అనేక చర్యలు చేపడుతున్న పరిస్ధితుల్లో ఆశించిన మార్పు కనపడటంలేదు. ఫ్రాన్స్ పరిస్ధితీ దాదాపు ఇదేవిధంగా ఉంది. అయినప్పటికీ అవసరమైన మౌలిక సౌకర్యాలు లేవంటుా వైద్యులు దేశప్రదాని ఇమ్మాన్సుయేల్ మెక్రాన్ ఎదుట నిరసన వ్యక్తంచేశారు. జన స్వరంపై 8 వారాల నిషేధాన్ని తొలగించింది.మరో ఐరోపా దేశమైన బెల్జియంలో మే 17 నాటికి 53,081 కేసులు వెలుగుచుాడగా 8,656 మంది మరణించారు. నెదర్లాండ్స్ లో మే 17 నాటికి 42,627 కేసులు వెలుగు చుాడగా 5,440 మంది కన్నుముాశారు. ఈ ఖండంలోని అతిపెద్ద దేశం, అగ్రరాజ్యమైన రష్యా పరిస్ధితి భిన్నంగా ఏమీలేదు. కరోనా వెలుగుచుాసిన చైనాతో సరిహద్దులు ఏర్పరుచుకుంటున్న ఈ కమ్యూనిస్ట్ దేశాలు తొలుత పెద్దగా ప్రభావం కనిపించలేదు. కానీ ఇప్పుడు పరిస్ధితి ఆందోళనకరంగా మారింది. ఏకంగా ప్రదాని మఖాయిల్ మిఘస్తిన్, అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ కరోనా పాజిటివ్ సోకింది. మే 17 నాటికి దేశ వ్యాప్తంగా 2,81,752 కేసులు వెలుగు చూసినప్పటికీ మరణాలను 2,631 కి నియంత్రించడం ఊరట కలిగించే అంశం. రాజధాని మాస్కో నగరంలోనే సగానికిపైగా కేసులు నమెాదవడం గమానర్హం. మాస్కో తరువాత స్ధానంలో సెయింట్ పీటర్స్ బర్గ్ ఉంది. దేశంలో దాదాపు 60 లక్షల మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.పరిస్ధితులు కుదుట పడనప్పటికి లాక్ డౌన్ తొలగింపునకే ఈ ఖండంలోని దేశాలు మెుగ్గుచుాపుతున్నాయి. కరోనాపై పోరాడుతుానే ఆర్ధికవ్యవస్ధను పట్టాలు ఎక్కంచాలన్నది ప్రభుత్వ లక్షంగా కనపడుతోంది. బ్రిటన్ ఈ దిశగా ముాడు విడతల ప్రణాళికను అమల్లోకి తెచ్చింది. ఇందులో 14 దేశాల పధకాలను చేర్చింది. తొలిదశ ఈ నెల 13 నుంచి ప్రారంభమైంది. జుాన్ 1 నుంచి రెండు, జులై4 నుంచి ముాడోదశ మెుదలవుతుంది. కరోనా ఇప్పటికపుడు సమసిపోయే సమస్య కాదని, ఇది దీర్ఘ కాలం ఉంటుందని ఆయా దేశాధినేతలు అర్ధంచే సుకుంటున్నారు. కరోనా నియంత్రణ టీకా సమీప భవిష్యత్తులో అందుబాటులోకి రాకపోవచ్చు, కరోనాతో కలసి ముందుకు సాగడం తప్ప మరోమార్గం లేదని బ్రటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించడం ఈ సందర్బంగా గమనార్హం. ఇటలి ప్రధానమంత్రి గిసెప్పీ సైతం ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. టీకా వచ్చేవరకు వేచి చూడలేమని, జాగ్రత్తలు తీసుకుంటుా ముందడగు వేయడం తప్ప వేరే మార్గం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. అందుకే భారత్ లో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు లాక్ డౌన్ ఎత్తివేత దిశగా అడుగులు వేస్తున్నాయి.

Related Posts