YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బెంగాల్ పై కమలం కన్ను

బెంగాల్ పై కమలం కన్ను

బెంగాల్ పై కమలం కన్ను
కోల్ కత్తా, జూన్ 4,
కరోనా మహమ్మారి కారణంగా తాత్కాలికంగా రాజకీయాలు కనుమరుగయ్యాయి. కరోనా లేనట్లయితే రాజకీయ పార్టీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధంచేసుకోవాల్సిన సమయమిది. వచ్చే ఏడాది అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఏన్నికలకు పార్టీలు సమాయత్తం కావాల్సి ఉంది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అసోం అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇవి ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలకు కుాడా కీలకమే. కేరళలోని సీపీఎం ప్రభుత్వాన్ని పడగొట్టడం, పుదుచ్చేరిలోని తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కాగ్రెస్ ముందున్న తక్షణ కర్తవ్యం. అసోంలోని తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కమలనాధుల లక్షం. దేశంలోని ఏకైక రాష్ట్రప్రభుత్వాన్ని మళ్ళీ నిబెట్టుకోవడం సీపీఎం కు పెద్ద సవాల్. వీటిని పక్కనపెడితే ఆసక్తి కలిగించేవి రెండు పెద్ద రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు, రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలైన తృణముల్ కాంగ్రెస్, అన్నాడిఎంకే, అధికారంలో ఉన్నాయి. ఎన్నికల నాటికి ఏదోఒక ద్రవిడపార్టీకి దగ్గరై అధికారానికి దగ్గరగా ఉండాలన్నది కమలనాధుల కోరిక. దేశంలో ఏపార్టీ ఏనాయకుడికి భిన్నంగా వ్యక్తిగతంగా, రాజకీయంగా తనకు సవాల్ విసురుతున్న టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీని మట్టిగరిపించాలన్నది మెాదీ మనసులోని మాట. అయిదు రాష్ట్రాలు ఉన్నప్పటికీ పెద్ద రాష్టాలైన తమిళనాడు, పశ్చిమబెంగాల్ పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (294 అసెంబ్లీ స్ధీనాలు) విభజన తర్వాత 234 అసెంబ్లీ స్ధానాలు, 39 లోక్ సభ స్ధానాలతో తమిళనాడు పెద్దరాష్ట్రాలుగా నిలిచింది. దశాబ్దాల తరబడి ఇక్కడ ద్రవిడ పార్టీల మధ్యే అధికారం మారుతోంది. జాతీయ పార్టీలది సైడ్ యాక్టర్ పాత్ర. ఏదో ఒక ప్రాంతీయ పార్టీ వైపు మెుగ్గు చుాపడం తప్ప బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు మరో ప్రత్యామ్నాయం లేదు. ఆ మాటకు వస్తే ద్రవిడ పార్టీలకు కుాడా అవసరార్ధం ఏదో ఒక జాతీయ పార్టీ తో పొత్తు పెట్టుకోవడం తప్పమరో మార్గం లేదు. దిగ్గజనాయకులైన కరుణానిధి, జయలలిత లేకుండా జరగబోతున్న ఎన్నికలివి. 2016 నాటి ఎన్నికల్లో జయలలిత సారథ్యంలోని అన్నా.డి.ఎమ్.కె 136 స్ధానాలతో విజేతగా నిలవగా, కరుణానిధి సారధ్యంలోని డీఎంకే 89 స్ధానాలతో గట్టిపోటీ ఇచ్చింది. అనంతరం 2019 లోక్ సభ ఎన్నికల్లో కరుణానిధి కుమారుడు స్టాలిన్ నేతృత్వంలో డి.ఎమ్.కె మెుత్తం 39 స్ధానాలకు గాను 23 స్ధానాల్లో విజయదుందుభి మెాగించింది. డి.ఎమ్.కె కుాటమిలోని ఒక్క ‘ తేని’ స్ధానంతోనే సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనన్న ధీమాతో డి.ఎమ్.కె ఉంది. సి.ఎమ్ పళనిస్వామి సారద్యంలోని అన్నాడిఎంకే పరిస్ధితి అంత ఆశాజనకంగా లేదు. ఎన్నకలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ఇటీవల 58 నుంచి 59 కి పెంచింది. దీనివల్ల దాదాపు సుమారు 25 వేలమంది ఉద్యోగులు లబ్ది పొందుతారని అంచనా. గత నాలుగేళ్ళలో పళనిస్వామి ప్రభుత్వ పనితీరు అంతగా ఆశాజనకంగా లేదు. ఏదైనా చివరిక్షణంలో మార్పులు జరిగితే తప్ప ప్రస్తుతానికి బీజేపీ, అన్నాడిఎంకె తో, సి.పి.ఐ, సి.పి.ఎం, కాంగ్రెస్ పార్టీలు డీఎంకే తో కలిసి పోరాడతాయి.అసెంబ్లీ స్ధానాల పరంగా యు.పి తర్వాత రెండో అతిపెద్ద రాష్ట్రమైన పశ్చిమబెంగాల్ (294 స్ధానాలు) అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికారాన్ని నిబెట్టుకునేందుకు మమతాబెనర్జీ సారద్యంలోెని టీఎంసీ సర్వశక్తులు ఒడ్డనుంది. అదే సమయంలో మమతను గద్దెదించడమే లక్షంగా కమలనాధులు కసరత్తు చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో మెాదీని నేరుగా సవాల్ చేస్తున్న నేత ఒక్క మమతాబెనర్జీనే. అందువల్ల ఆమెను ఎన్నికల్లో ఓడించడం ద్వారా కట్టడిచేయాలన్నది కమలనాధుల వ్యూహం. వాస్తవానికి 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించింది ముాడు సీట్లే. అయితే 2019 లోక్ సభ ఎన్నికల్లో మెుత్తం 42 స్ధానాలకు 18 స్ధానాలను సాధించడం ద్వారా రైటర్స్ బిల్డింగ్ (రాష్ట్ర ప్రభుత్వ సచివాలయం) ను చేజిక్కించుకోవాలన్నది కమలనాధుల ఆశ. బంగ్లదేశ్ అక్రమ వలసలు, ముస్లింల బుజ్జగింపు, రోహింగ్యా ముస్లింలు, శారదా కుంభకోణం, కరోనా కట్టడిలో మమత వైఫల్యం తదితర అంశాలతో టీఎంసీ ని ఢీకొట్టాలన్నది బీజేపీ వ్యూహం. గత ఎన్నికల్లో 44, 26 స్ధానాలు సాధించిన కాంగ్రెస్, సి.పి.ఎం లను కనీసం రెండో అతిపెద్ద పార్టీగా ఎదగాలన్నది బీజేపీ వ్యూహం. 2016 ఎన్నికల్లో 200 కు పైగా స్ధానాలు సాధించిన దీదీ (మమతా బెనర్జీ) ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. బీజేపీ, ముఖ్యంగా మెాదీపై ఒంటికాలిపై లేస్తున్నారు. జాతీయ స్ధాయిలో మెాదీతో ప్రత్యక్షంగా తలపడుతోంది ఒక్క మమతనే కావడం గమనార్హం. పౌరసత్వ సవరణ చట్టం (CAA), హిందుత్వ, రాష్ట్రానికి సాయంతో కేంద్రం మెుండిచేయి తదితర అంశాలను ఎత్తిచుాపుతుా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు సి.పి.ఎం, కాంగ్రెస్ వంటి విపక్షాలుతోపాటు కాంగ్రెస్ మమతకు సహకరించే అవకాశాలు కుాడా లేకపోలేదు. మెుత్తానికి తుార్పు రాష్ట్రమైన బెంగాల్ లో రసవత్తర పోటీ జరగనుంది. బీజేపీని ఎదుర్కొనేందుకు మమత సర్వశక్తులను ఒడ్డనుంది. అదే సమయంలో మమతకు అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ అదే తరహాలో పోరాటం చేయనుంది.

Related Posts