YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

చితికిపోయిన చిన్న వ్యాపారులు

చితికిపోయిన చిన్న వ్యాపారులు

చితికిపోయిన చిన్న వ్యాపారులు
హైద్రాబాద్, జూన్ 4, 
లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌సడలింపులతో గ్రేటర్‌‌‌‌‌‌‌‌లో డైలీ పెరుగుతున్న కరోనా కేసులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇప్పటికే 15 మంది చిరువ్యాపారులకు పాజిటివ్‌‌‌‌‌‌‌‌వచ్చింది. వీరికి ఎవరి నుంచి స్ప్రెడ్అయ్యిందనే దానిపై క్లారిటీ లేదు. బల్దియా అధికారులు కాంటాక్ట్లు  కనిపెట్టే పనిలో పడ్డారు. కరోనా ఎఫెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నిత్యావసరాల అమ్మకాలకు పర్మిషన్స్ ఉన్నాయి. ప్రజలు కూడా మార్కెట్లకు వెళ్లేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రిలాక్సేషన్స్ ఇచ్చాక గుంపులుగా తిరగడంతో ప్రస్తుతం వైరస్ వేగంగా విస్తరిస్తోంది.జియాగూడ, ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌, ముషీరాబాద్‌‌‌‌‌‌‌‌ఏరియాలకు చెందిన15 మంది కూరగాయల వ్యాపారులకు పాజిటివ్‌‌‌‌‌‌‌‌వచ్చింది. ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌గణేశ్‌‌‌‌‌‌‌‌ఏరియాలో ఉండే వృద్ధురాలు కూరగాయలు అమ్ముతుంది. ఇటీవల ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడంతో జియాగూడలో ఉండే కూతురు, అల్లుడు వచ్చి పరామర్శించి వెళ్లారు. పరిస్థితి విషమించి నాలుగు రోజల కిందట ఆమె మృతి చెందింది.  టెస్టుల్లో కరోనా సోకినట్టు తేలింది.  వెంటనే కూతురు, అల్లుడికి టెస్టులు చేయగా పాజిటివ్‌‌‌‌‌‌‌‌వచ్చింది. అలాగే వృద్ధురాలిని పరామర్శించిన మరో 8 మందికి వైరస్‌‌‌‌‌‌‌‌సోకినట్టు స్పష్టమైంది. మరికొందరిలో లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. వీరు ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌, రాజ్‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌రోడ్‌‌‌‌‌‌‌‌లో తోపుడు బండ్లు పెట్టి, మరికొందరు ఇంటింటికి తిరిగి కూరగాయలు, పండ్లు అమ్ముతుంటారని తెలిసింది. ముషీరాబాద్‌‌‌‌‌‌‌‌ముత్యాల బస్తీలో ఓ కూరగాయల వ్యాపారికి కరోనా వచ్చింది.గ్రేటర్‌‌‌‌‌‌‌‌ పరిధిలో సోమవారం ఒక్కరోజే 122, మంగళవారం 79 కేసులు వచ్చాయి. కొందరు మార్కెట్లలో రూల్స్ బ్రేక్ చేస్తూ గుమిగూడుతున్నారు. సడలింపులిచ్చారని మాస్క్లు, ఫిజికల్ డిస్టెన్స్ను లైట్ తీసుకుంటున్నారు. కేసులు భారీగా పెరగడానికి రిలాక్సేషన్సే కారణమని బల్దియా అధికారులు స్పష్టం చేస్తున్నారు. బయటికెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే వైరస్‌‌‌‌‌‌‌‌ బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. సిటీలో చాలా కేసుల్లో లింకులు దొరకట్లేదు. కమ్యూనిటీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌మిషన్‌‌‌‌‌‌‌‌ ద్వారానే వ్యాధి విస్తరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది

Related Posts