ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్
విజయనగరం జూన్ 4,
ఉత్తరాంధ్ర జిల్లాలలో డిప్యూటీ సీఎం,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని రెండవ రోజు పర్యటన కొనసాగింది. విజయనగరం లో గవర్నమెంట్ హాస్పిటల్ కు ఆనుకొని ఉన్న 30ఎకరాల స్థలాన్ని మెడికల్ కాలేజీ ఏర్పాటుకు గురువారం అయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణి, మంత్రి ధర్మాన కృష్ణ దాసు,ఎంపీ బెల్లన చంద్రశేఖర్, శాసనసభ్యులు అప్పలనరస, అప్పలనాయుడు, కలెక్టర్ హరి జవహర్ లాల్,, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి సంకల్పం. విజయనగరం లో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ను 500పడకల హాస్పిటల్ గా అభివృద్ధి చేస్తాం. ప్రజలు వైద్యం అందక ఎక్కడ ఇబ్బంది పడకూడదని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయమని అన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ తో దీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో పేద ప్రజలకు వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వినూత్నమైన ఆలోచన. రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా వైద్యం అందక ఇబ్బందులు పడకూడదు...గుమ్మం ముందే వైద్యం అందించడానికి విలేజ్ క్లినిక్ లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.