అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు
భారీగా చోరీ సొత్తు స్వాధీనం
వరంగల్ జూన్ 4,
తాళం వేసివున్న ఇండ్లను లక్ష్యంగా చేసుకోని చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగ సయ్యద్ ఆలాఫ్ ఆలియాస్ అఫ్రోజ్ ను గురువారం సి.సి.ఎస్, ఖాజీపేట పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు. పోలీసులు అరెస్టు చేసిన దొంగ నుండి సూమారు 30లక్షల విలువగల 475 గ్రాముల బంగారు, 3 కి.లోల వెండి అభరణాలతో పాటు, 2లక్షల 50వేల నగదు, 5ఎల్.ఈ.డీ టివిలు, 4ల్యాప్ ట్యా న్లు , ఒక ప్రింటర్, 2 సెల్ ఫోన్లు, 6కెమెరాలు, ఒక ట్యాబ్, ఒక డిజిటల్ వాచ్ ఖరీదైన చలువ అద్దాలతో పాటు ఒక గ్యాస్ సిలెండర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ప్రకాశం జిల్లా చీరాల మండలం నవపేట గ్రామానికి చెందిన వాడు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి.రవీందర్ వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు సయ్యద్ అల్తాఫ్ బాల్యం నుండే చిల్లర చోరీలకు పాల్పడటంతో నిందితుడి తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుండి పారిపోయిన నిందితుడు విజయవాడలో కారు డ్రైవింగ్ నేర్చుకోని కోద్ది రోజులు కారు డ్రైవర్గా పనిచేశాడు. ఇదే సమయంలో నిందితుడికి చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. నిందితుడు చేసే జల్సాలకు తాను సంపాదించే డబ్బు సరిపోకపోవడంతో సులువుగా డబ్బు సంపాద కోసం రాత్రి మరియు పగలు సమయాల్లో అవకాశాన్ని బట్టి తాళం పగులగొట్టి చోరీలు చేసేందుకు నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే నిందితుడు 2000 సంవత్సరం నుండి 2013 మధ్యకాలంలో నిందితుడు ఆంధ్రప్రదేశ్ లోని ఈస్ట్ గోదావరీ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చోరీలకు పాల్పడటంతో నిందితుడుని పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చేసిన చోరీ కేసులో నిందితుడికి నాలుగు సంవత్సరాలు కోర్టు జైలు శిక్ష విధించింది. జైలు జీవితం అనుభవించి తిరిగి 2017 సంవత్సరం డిసెంబర్ మాసంలో రాజమండ్రి జైలు విడుదలయిన నిందితుడు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో కోద్ది రోజులు కార్పెంటర్ గా పనిచేస్తూనే మహబూబాబాదు చెందిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. కోద్ది రోజులు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా వున్న నిందింతుడు 2018 నుండి తిరిగి జల్సాలకు అలవాటు పడటంతో మరోమారు చోరీలకు పాల్పడేందుకు సిద్ధమైనాడు. ఇందులో భాగంగా నిందితుడు వరంగల్ పోలీస్ కమిషనరేట్, భద్రాద్రి కోత్తగూడెం, ఖమ్మం, పాల్వంచ ప్రాంతాల్లో తాళం వేసివున్న ఇండ్లల్లో చోరీలకు తెగబడ్డాడు. చోరీ చేసిన డబ్బుతో నిందితుడు కార్లను కోనుగోలు చేసి కోద్ది రోజులు వాడుకోని తిరిగి అమ్మేవాడు.నిందితుడు 2018 నుండి ఇప్పటివరకు మొత్తం 28 చోరీలకు పాల్పడగా ఇందులో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 20 చోరీలకు చేయగా ఇందులో ఖాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 5,సుబేదారి 5, కేయూసి, మీ కాలనీ, పర్కాల పోలీస్ స్టేషన్ల పరిధిలో 2చోప్పున మొత్తం 6చోరీలకు పాల్పడగా శాయంపేట, దామెర, మడికొండ, మామునూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చోప్పున మొత్తం 4చోరీలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7, ఖమ్మం జిల్లాలో ఒకచోరీ చేశాడు.ఈ చోరీలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు పోలీస్ కమిషనర్ అదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఓ.ఎన్డీ తిరుపతి నేతృత్వంలో సి.సి.ఎస్ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్, కాజీపేట ఇన్ స్పెక్టర్ నరేందర్ అధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తులు బృందాలను ఏర్పాటు చేసి ప్రస్తుతం అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని నిందితుడిని గుర్తించిన పోలీసులు నిందితుడి కదలికలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా నిందితుడు కాజీపేటలోని ఫాతీమా జంక్షన్ ప్రాంతంలో వున్నట్లుగా సమాచారం రావడంతో సి.సి.ఎస్ మరియు కాజీపేట పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకోని విచారించడంతో నిందితుడు పాల్పడిన చోరీలను పోలీసుల ఎదుట అంగీకరించడంతో పాటు, నిందితుడి నుండి కొంత మొత్తంలో బంగారు, వెండి అభరణాలతో పాటు, ఒక లక్ష రూపాయల నగదుతో పాటు, నిందితుడు ఇచ్చిన సమాచారంతో నిందితుడు నివాసం వుంటున్న అద్దె ఇంటి నుండి చోరీ చేసిన బంగారు, వెండి అభరణాలు, ఇతర చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్ రాష్ట్ర దొంగను అరెస్టు భారీ స్థాయిలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంతో ప్రతిభ కనబరిచిన ఓ.ఎన్డీ తిరుపతి, క్రైం ఎ.సి.పి బాబురావు, కాజీపేట్ ఎ.సి.పి రవీందర్ కుమార్, సి.సి.ఎస్ ఇన్స్పెక్టర్లు రమేష్ కుమార్, శ్రీనివాసరావు, కాజీపేట ఇన్స్పెక్టర్ నరేందర్, ఎస్.ఐ దేవేందర్, అసిస్టెంట్ అనాలిటికల్ ఆఫీసర్ సల్మాన్ పాషా, సి.సి.ఎస్ ఎస్.ఐ బి.వి.ఎస్ రావు, ఎ.ఎస్.ఐ శ్రీనివాస రాజు, శివకుమార్, హెడ్ కానిస్టేబుళ్లు రవి కుమార్, జంపయ్య, కానిస్టేబుళ్ళు మహమ్మద్ ఆలీ (మున్నా ), వేణుగోపాల్, వంశీ, నజీరుద్దీన్, నర్సింగరావులను వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి.రవీందర్ అభినందించారు.