పదవ తరగతి పరీక్షల నిర్వహణ కేసు శుక్రవారానికి వాయిదా
భైదరాబాద్ జూన్ 4,
పదవ తరగతి పరీక్షల నిర్వహణ కేసును హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. గురువారం నాడు జరిగిన విచారణ సమయంలో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టు కు ఓ నివేదికను అందించారు. పరీక్షల నిర్వహణ విషయమై తేదీలవారీగా వివరాలను, సంబంధిత ఏర్పాట్ల వివరాలను హైకోర్టుకు ప్రభుత్వం ఈ సందర్భంగా అందించింది. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పరీక్షల నిర్వహణకే సిద్ధంగా ఉన్నారా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలనూ తీసుకుంటున్నామని వెల్లడించింది. అయితే... ప్రస్తుతం కరోనా కేసులు రుగుతున్నాయని పేర్కొంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో పదవ తరగతి పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని హైకోర్టును పిటిషనర్ అభ్యర్ధించారు. కేసును హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.