YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీసీ భవన్ ఎదుట నిరసన 

బీసీ భవన్ ఎదుట నిరసన 

బీసీ భవన్ ఎదుట నిరసన 
నెల్లూరు జూన్ 4,
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ తెదేపా ఇంచార్జీ మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్  స్థానిక కొండయపాలెం గేట్ వద్దనున్న బిసి భవన్ ఎదుట లాక్ డౌన్  నిభంధనలను పాటిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్  మాట్లాడుతూ  గత తెలుగుదేశం ప్రభుత్వoలో  2019 జనవరి 3 న అప్పటి మంత్రులు కింజరాపు అచ్చెoనాయుడు, అమరనాధ రెడ్డి , సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,   పొంగురు నారాయణ  , తెదేపా నెల్లూరు జిల్లా అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర, పలువురు బిసి నాయకుల ఆధ్వర్యం లో బిసి సంక్షేమ శాఖ నిర్వహణలో బిసి భవన్ మరియు స్టడీ సర్కిల్ నిర్మాణం కోసం నెల్లూరు కొండయపాలెం గేట్ వద్ద గల బిసి సంక్షేమ కార్యాలయం ఆవరణ లో శంఖుస్థాపన చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు. సుమారు 4.50 కోట్ల రూపాయల వ్యయం తో బిసి భవన్ మరియు స్టడీ సర్కిల్ నిర్మించడానికి అంచనాలు కూడా తయారుచేసి ఆర్ధిక అనుమతులు కూడా ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.  బుధవారం కొంతమంది కుట్రపూరితంగా ఈ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారన్నారు. ఇది డారుణమైన చర్యనని పేర్కొన్నారు.అనంతరం స్థానిక 4వ పట్టణ పోలీసు ఇనెప్పెక్టర్ ను  కలిసి వినతి పత్రం ఇచ్చారు. అక్కడ మీడియా తో మాట్లాడుతూ నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ కూడా మా ప్రభుత్వం లో కట్టినదే అని శిలాఫలకం చూపి గుర్తు చేశారు దీనిని కూడా ఎక్కడ ధ్వంసం చేస్తారో అని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ గతం లో అధికారంలో ఉన్నప్పుడూ ఏనాడూ కూడా శిలాఫలకాల పై పేర్ల కోసం పని చెయ్యలేదన్నారు. మేము ఎప్పుడు రాళ్లపై పేర్ల కోసం ఆరాట పడలేదు ప్రజల గుండెల్లో మా పేర్లు ఉండాలని పని చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిసి సెల్ జిల్లా అధ్యక్షులు పి ఎల్ రావ్ ,మల్లీ నిర్మల, మాజీ కొర్పోరేటర్ కప్పిర  శ్రీనివాసులు,మాజీ కార్పొరేటర్  ధర్మవరపు సుబ్బారావు,సాబీర్ ఖాన్,జలదంకి సుధాకర్,రాజా యాదవ్,సుబ్బరాజు,గుడ్డేటి చెంచయ్య  తదితరులు పాల్గొన్నారు.

Related Posts