YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

 రైతులకు శుభవార్త - 

 రైతులకు శుభవార్త - 

 రైతులకు శుభవార్త - 
కేంద్ర కేబినెట్‌ చారిత్రాత్మక నిర్ణయం 
విజయవాడ జూన్ 4, 
కరోనా వైరస్‌ విలయతాండవం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, ఈ సంక్షోభాన్ని నివారించి ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు కేంద్ర కేబినెట్‌ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని బీజెపీ రాష్ట్ర రైతు నాయకులు  వై.వి. సుబ్బారావు తెలియజేశారు. రైతులు తాము పండించిన ఉత్పత్తులను ఇకపై ఇతర రాష్ట్రాల్లోనూ అమ్ముకునే విధంగా చట్టంలో కీలకమైన మార్పులకు  ప్రధాని నరేంద్ర మోది  నాయకత్వంలోని నడుస్తున్న కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని, ఈ మేరకు నిత్యావసర వస్తువుల చట్టం 1955కు ప్రతిపాదించిన పలు కీలక సవరణలను ఆమోదించిందని, దేశంలోని రైతులకు ఇది చరిత్రాత్మకమైన రోజు అని వై.వి. సుబ్బారావు హర్షం వ్యక్తంచేశారు. దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ  రైతులకు మాత్రం ఈ రోజే వచ్చిందని అది కూడా ప్రధాని నరేంద్ర మోది వల్లే అని ఆయన అన్నారు. స్థానికంగా ఉండే వారు కొనుగోలు చేయకపోతే, తమ ఉత్పత్తులను ఏదో ఒక ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఇప్పటివరకు ఉండేదని, కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈ పరిస్థితుల్లో మార్పు రానుందని, ధరల విషయంలో ఇంతకాలం వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై రైతులు ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని రాష్ట్ర రైతు నాయకులు  వై.వి. సుబ్బారావు అన్నారు. ఈ నిర్ణయం ద్వారా రైతులకు మాత్రమే కాదు మొత్తం వ్యవసాయ రంగానికే లాభం కలుగుతుందని వ్యాఖ్యానించారు. స్థానిక మార్కెట్ కమిటీలు రైతులకు మంచి ధర రావడానికి అడ్డంకిగా మారాయని, బయట అమ్ముకుంటే మంచి ధర వచ్చే అవకాశం ఉన్నా కేవలం లైసెన్స్ ఉన్న దళారీలకు మాత్రమే తమ వస్తువులను అమ్ముకునేలా చేశాయని, అయితే ఈ కొత్త చట్టం కారణంగా రైతులు ఇతర రాష్ట్రాల్లో తమ ఉత్పత్తులను విక్రయించే వీలు కలుగుతుందని, రైతులు ఈ ట్రేడింగ్ ద్వారా దేశంలో  ఎక్కడైనా రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చునని  భారత్ ఒకే దేశం, ఒకే మార్కెట్ దశకు చేరుకుంటోందని, పెట్టుబడులను ఆకర్శించేందుకు ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ సెల్స్‌(పీడీసీ)కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని  బీజెపీ రాష్ట్ర రైతు నాయకులు వై.వి. సుబ్బారావు తెలియజేశారు.

Related Posts