ఇసుక కొరతపై ఎమ్మెల్యే నిరసన
ఏలూరు జూన్ 4,
రాష్ట్రంలో ఇసుక కొరత పై పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మలరామానాయుడు వినూత్న నిరసన చేపట్టారు. తోపుడు బండి పై మార్కెట్ లో ఇసుకను విక్రయిస్తూ నిరసనకు దిగారు. రాయల కాలంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మితే జగన్ పాలనలో ఇసుకను రత్నాలుగా అమ్ముతున్నారని అన్నారు.రాష్ట్రంలో భవన కార్మికులు ఇసుక కొరతతో తినడానికి తిండి లేక పస్థులు ఉంటే ప్రభుత్వానికి చీమ కొట్టినట్లు కూడా లేదని,సంచి నిండా డబ్బు పట్టుకు వెళితే తట్ట ఇసుక కొనుక్కుని వెళ్లే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.రాష్ట్ర లో జగన్ కు 151 సీట్లు ఇచ్చినందుకు ప్రజలు కళ్ళల్లో ఇసుక కొత్తరని ఎద్దేవా చేశారు. ఫోన్ కొడితే ఇంటికి ఇసుక అన్నారు,కానీ నేడు ఇసుక పేరు చెబితే కరెంట్ షాక్ కొడుతుందని, రాష్ట్రం లో ఇసుకే బంగారమాయే అంతా జగన్ మాయ అంటున్నారు.ఈ సంధర్బంగా మార్కెట్లో ఎమ్మెల్యే వద్ద మహిళలు వంటి మీద బంగారం తీసి ఇసుక కొనుక్కున్నారు. ఇంటికి వెళ్లి వచ్చే సరికి ఇసుక అయిపోతుందేమో అని వంటి మీద బంగారం ఇచ్చి గ్రాములలో ఇసుక కొనుగోలు చేస్తున్నామన్నారు.అనంతరం తాహశీల్ధార్ కు ఇసుక కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.