YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఆలు.. అల్లం..వెల్లుల్లి తెలంగాణలోనే పండాలి..ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా టార్గెట్

ఆలు.. అల్లం..వెల్లుల్లి తెలంగాణలోనే పండాలి..ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా టార్గెట్

ఆలు.. అల్లం..వెల్లుల్లి తెలంగాణలోనే పండాలి..
        ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా టార్గెట్
హైదరాబాద్ జూన్ 4
ఒకటి అనుకున్న తర్వాత దాన్ని విడిచి పెట్టకుండా.. సాధించే వరకూ వదిలిపెట్టని తీరు కొందరిలో కనిపిస్తుంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ది అలాంటి ధోరణే. ఎప్పటికప్పుడు ఆయనో టార్గెట్ పెట్టుకోవటం.. దాన్ని సాధించే వరకూ దాని మీదే ఫోకస్ పెట్టటం ఆయనకో అలవాటు. తెలంగాణను వ్యవసాయానికి కేరాఫ్ అడ్రస్ గా మార్చాలన్న ఆలోచనలో ఉన్న ఆయన.. భారీ ఎత్తున నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో తాను అనుకున్నది అనుకున్నట్లు చేసుకుంటూ పోతున్నారు. ఈ ప్రాజెక్టుతో పాటు.. ఇరిగేషన్ విషయంలో కేసీఆర్ విజన్ పుణ్యమా అని.. గతంలో నీళ్లు కనిపిస్తే పండుగ చేసుకునే తెలంగాణలో.. ఇప్పుడు చాలావరకు పల్లెలలు జలసిరులతో కళకళలాడుతున్నాయి. ఇలాంటి అనుభవం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇంతకు ముందెప్పుడూ లేదు. సాగుకు నీటి వసతి పెరగటంతో.. పెద్ద ఎత్తున వ్యవసాయం పై ఫోకస్ పెట్టటం.. ఏ పంటను ఎంత పండించాలన్న విషయం మీద కూడా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం ఆసక్తికరంగా మారింది. ఏ పంటను పండించాలో కూడా రైతులకు స్వేచ్ఛ ఇవ్వకపోవటం ఏమిటన్న విమర్శలు వినిపించినా.. ఒక వ్యూహంలో భాగంగా.. రాష్ట్రంలో ఏ పంటను ఎంత పండించాలన్న దానిపై క్లియర్ విజన్ తో అడుగులు వేస్తున్నారు కేసీఆర్.  ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన కొత్త లక్ష్యాన్ని పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో వివిధ పంటల్ని పండిస్తున్నా.. ప్రజల అవసరాలకు తగ్గట్లు కొన్ని పంటల్ని పండించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున వినియోగించే ఆలు (బంగాళ దుంపలు)తో పాటు అల్లం.. వెల్లుల్లిని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని.. అందుకే వీటిని రాష్ట్రంలోనే పండించే దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలని కేసీఆర్ కోరుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఆలు.. అల్లం.. వెల్లుల్లిని ఎక్కడ పండించే వీలుంది? ఈ పంటలకు సంబంధించి మేలైన సాగు విధానాలు ఏమిటి? అన్న దానిపై వ్యవసాయ అధికారులు క్లారిటీ ఇవ్వాలని కేసీఆర్ అడిగినట్లుగా చెబుతున్నారు. తెలంగాణ ప్రజల అవసరాలకు సరిపడేలా ఈ పంటల్ని పండించాలన్నది కేసీఆర్ తాజా టార్గెట్ గా చెబుతున్నారు. మరి ఎప్పటికి పండిస్తారో చూడాలి.
 

Related Posts