సత్యవేడులో ఆరులారీలను పట్టుకున్న అధికారులు.
సత్యవేడు జూన్ 4,
సత్యవేడు సర్కిల్ పరిధిలో అక్రమంగా తరలిపోతున్న కంకర రాళ్లు, ఇసుకకు సంబంధించి ఆరు లారీలను తిరుపతి ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఇందులో మూడు ఇసుక లారీలు, మరో మూడు కంకర లారీలు ఉన్నట్టు సమాచారం. తిరుపతి ఎన్ఫోర్స్మెంట్ అధికారి రమేష్ అయ్యా ఆధ్వర్యంలో అధికారుల బృందం గురువారం తెల్లవారుజామున సత్యవేడు సర్కిల్ పరిధిలో దాడులు నిర్వహించారు. ఓవర్ లోడింగ్తో పాటు ఎటువంటి బిల్లు లేకుండా తరలిపోతున్న 6 లారీలను స్వాధీనం చేసుకొని భద్రత రీత్యా స్థానిక ఆర్టీసీ గ్యారేజ్ కి తీసుకెళ్లి అప్పగించడం జరిగింది. ముఖ్యంగా అరుణ నది ఏటీ నుంచి ఇసుక అక్రమంగా సరిహద్దులు దాటకుండా కట్టడిలో భాగంగా ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులకు పూనుకుంటున్నారు. అయినా కూడా సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్) ముసుగులో ఇసుక దారి మల్లు తున్నట్టు సర్వత్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా సత్యవేడు సర్కిల్ పరిధిలో పలు చోట్ల పోలీసు తనిఖీ కేంద్రాలు నడుస్తున్న బిల్లు లేకుండా ఇసుక తరలింపు ఎలా సాధ్యమనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. దీనిపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది.