రష్యాలో పినుజులు
మాస్కో, జూన్ 5
కరోనా వైరస్‌తో కకావికలమవుతోన్న రష్యాకు కొత్త ముప్పు వచ్చింది. అక్కడ రక్తాన్ని పీల్చే పేల లాంటి పురుగుల దాడి తీవ్రమైంది. ఇప్పటికే వీటి బారిన పడి వేలాది మంది ఆస్పత్రుల్లో చేరారు. ఆస్పత్రులన్నీ ఇప్పటికే కొవిడ్-19 రోగులతో కిక్కిరిసిపోగా.. ఈ కొత్త ముప్పు తలనొప్పిగా మారింది. అంతేకాకుండా ఈ పేల బాధితులకు ఇప్పటిదాకా ఇస్తున్న వ్యాక్సిన్‌లు ప్రభావవంతంగా పనిచేయకపోవడం ఆందోళన కలిగించే అంశం. వీటి వైరస్ జన్యు నిర్మాణంలో మార్పులు రావడంతో ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్‌లు రోగి శరీరంపై పనిచేయకపోవచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారష్యాలో ఈ పేల దాడి కొత్తేమీ కాకపోయినా.. ఈసారి ఇవి కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా రక్తాన్ని పీల్చే ఈ పేలలో ఈసారి జన్యుపరివర్తన (మ్యుటేషన్) వచ్చినట్లు నిపుణులు గుర్తించారు. ఈ కారణంగా కొత్త రకమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వీటి ప్రభావం చిన్నారులపై అధికంగా ఉంది. రష్యాలో గత కొన్నేళ్లుగా వీటి బారిన పడి వేలాది మంది మరణించాచూడటానికి ఇవి పేల లాగే ఉన్నా.. ఆకారంలో పెద్దగా ఉన్నాయి. భారత్‌లో వీటిని పినుజులుగా వ్యవహరిస్తారు. ఇవి ఎక్కువగా జంతువుల్లో కనిపిస్తాయి. గడ్డి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ పేలు ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. ప్రజలు అలాంటి ప్రాంతాల్లో సంచరించినప్పుడు దాడి చేస్తున్నాయి. నొప్పి తెలియకుండా రక్తాన్ని పీల్చేస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి వీటి ఉత్పత్తి 428 రేట్లు అధికంగా ఉన్నట్లు రష్యా అధికారులు గుర్తించారు.ఈ పేల దాడి వల్ల మనుషుల్లో వైరల్ ఎన్‌సెఫలిటిస్ వస్తోంది. ఇది క్రమంగా బ్రెయిన్ డ్యామేజ్‌కు దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జన్యుపరివర్తిత పేలతో దాడితో బొరియాలిసిస్ వ్యాధి సంక్రమిస్తోంది. లైమ్ డిసీజ్‌గా పిలిచే ఈ వ్యాధి నరాలు, గుండె, కీళ్లపై ప్రభావం చూపుతోంది.సైబీరియా ప్రాంతంలో ఈ పేల ప్రభావం అధికంగా ఉంది. స్వెర్డ్‌లోస్క్ ప్రాంతంలో 17,242 మంది, క్రస్నోయార్స్క్ ప్రాంతంలో సుమారు 10 వేల మంది ఈ పేల దాడికి గురై ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో 2 వేల మందికి పైగా చిన్నారులు ఉన్నారు. సెర్‌డ్లోస్క్ ప్రాంతంలోనూ కేసులు అధికంగా వస్తున్నాయని అధికారులు తెలిపారు.ఇప్పటికే కరోనా కేసుల్లో మూడో స్థానంలో ఉన్న రష్యాకు.. ఈ విష పురుగుల దాడి తలనొప్పిగా మారింది. వీటి దాడిని తేలిగ్గా తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని సమర్థంగా ఎదుర్కోకపోతే భారీ ప్రాణ నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.